పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 8 మంది పాక్ ఆర్మీ సైనికులు మృతి

బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని గ్వాదర్ నగరంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఐఈడీ పేలుడులో 8 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు మృతి చెందారు. పడిజార్ ప్రాంతంలోని మెరైన్ డ్రైవ్ వెంబడి ఉన్న జీపీఏ కార్యాలయం సమీపంలో గుర్తు తెలియని కొందరు దుండగులు దాడి చేశారు.

New Update
Pakistan Attack

Pakistan Attack Photograph: (Pakistan Attack)

పాకిస్థాన్‌లో గుర్తు తెలియని కొందరు దుండగులు దాడులు చేశారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని గ్వాదర్ నగరంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఐఈడీ పేలుడులో 8 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు మృతి చెందారు. పడిజార్ ప్రాంతంలోని మెరైన్ డ్రైవ్ వెంబడి ఉన్న జీపీఏ కార్యాలయం సమీపంలో ఈ దాడి జరిగింది.

ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

సైనిక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని..

కొందరు గుర్తు తెలియని దుండగులు సైనిక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ పేలుడులో 8 మంది మృతి చెందడంతో పాటు మరో నలుగురు సైనికులు భారీగా గాయపడ్డారు. అయితే ఈ దాడికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) తో సంబంధాలు ఉండవచ్చని భావిస్తున్నారు. భారీ పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతమంతా కూడా బాగా ఉద్రికత్త పెరిగింది. 

ఇది కూడా చూడండి:  Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

ఇదిలా ఉండగా ప్రస్తుతం పాకిస్థాన్‌లో పరిస్థితులు ఘోరంగా మారుతున్నాయి. ఇటీవల మార్చి 11వ తేదీన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసి, అనేక మంది సైనికులతో సహా 400 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకుంది. ఈ దాడిలో 25 మంది మరణించారు. దీని తరువాత, మార్చి 16న, నోష్కిలో ఒక బస్సుపై దాడి చేసి 90 మంది సైనికులను చంపినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు