జపాన్‌పై కిమ్ క్షిపణి ప్రయోగం.. 19 రోజుల్లో నాలుగు మిస్సైల్ టెస్టులు

ఉత్తర కొరియాలో ఆదివారం జరిపిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ ఏడాదిలో ఇది ఏడవ క్షిపణి పరీక్ష కాగా, ఒక్క ఏప్రిల్ నెలలోనే ఇది నాలుగో ప్రయోగం కావడం విశేషం. కిమ్ జోంగ్ ఉన్ పెరుగుతున్న దురాక్రమణ ధోరణికి ఇది పరాకాష్టగా మారుతోంది.

New Update
_North Korea conducts

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేశారు. ఆదివారం ఉదయం ఉత్తర కొరియా జరిపిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఏడాదిలో ఇది ఏడవ క్షిపణి పరీక్ష కాగా, ఒక్క ఏప్రిల్ నెలలోనే ఇది నాలుగో ప్రయోగం కావడం విశేషం. కిమ్ జోంగ్ ఉన్ పెరుగుతున్న దురాక్రమణ ధోరణికి ఇది పరాకాష్టగా మారుతోంది. కిమ్ క్షిపణి ప్రయోగాలు ఎటువైపు దారితీస్తాయోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఏఎన్ఐ నివేదికల ప్రకారం, ఉత్తర కొరియా తూర్పు తీర నగరమైన సిన్పో నుండి ఈ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. జపాన్ ప్రధాని సనాయే తకైచి ఈ విషయాన్ని X వేదికగా ధృవీకరించారు. ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్రయోగించిన ఈ క్షిపణులు జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) వెలుపల సముద్రంలో పడ్డాయి. క్షిపణులు తమ సరిహద్దుల్లో పడకపోయినప్పటికీ, కిమ్ చర్యలను జపాన్ తీవ్రంగా పరిగణిస్తోంది.

ప్రధాని తకైచి వెంటనే అత్యున్నత స్థాయి భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. "శత్రువు ప్రతి కదలికను మేము గమనిస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది" అని ఆమె స్పష్టం చేశారు. సముద్రంలోని నౌకలు, ఆకాశంలో ఎగిరే విమానాలకు తక్షణమే హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికా-దక్షిణ కొరియా జాయింట్ ఎంక్వైరీ 
ఈ క్షిపణి ప్రయోగం జరిగిన నిమిషాల్లోనే జపాన్, అమెరికా, దక్షిణ కొరియా దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు మొదలయ్యాయి. దక్షిణ కొరియా సైన్యం ప్రకారం, ఈ క్షిపణులను ఉదయం 6:10 గంటల ప్రాంతంలో ప్రయోగించారు. ఈ క్షిపణుల సామర్థ్యం ఎంత? వాటి అసలు లక్ష్యం ఏమిటి? అనే కోణంలో మూడు దేశాలు కలిసి దర్యాప్తు చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం ఉత్తర కొరియాపై కఠినమైన ఆంక్షలు ఉన్నప్పటికీ, కిమ్ జోంగ్ ఉన్ వాటిని బేఖాతరు చేస్తూనే ఉన్నారు.

ట్రంప్-జిన్‌పింగ్ భేటీ వేళ ఉద్రిక్తత
వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీ కానున్న తరుణంలో కిమ్ ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. ఈ కీలక సమావేశంపై ఒత్తిడి తెచ్చేందుకే కిమ్ తన సైనిక బలాన్ని ప్రదర్శిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) సైతం ఉత్తర కొరియా అణు సామర్థ్యాలు మునుపెన్నడూ లేనంతగా పెరిగాయని హెచ్చరించింది. తన దేశం ఇప్పుడు ఒక పూర్తిస్థాయి "అణుశక్తి" అని, ఆ హోదా నుండి వెనక్కి తగ్గేది లేదని కిమ్ జోంగ్ ఉన్ పదేపదే స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికి జపాన్, దక్షిణ కొరియా దేశాలు తమ సరిహద్దుల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశాయి. 

Advertisment
తాజా కథనాలు