Donlad Trump : ట్రంప్ హత్యకు స్కెచ్: ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేందుకు జరిగిన ప్రయత్నానికి సంబంధించి అమెరికా న్యాయ శాఖ షాకింగ్ వీడియో ఫుటేజీని విడుదల చేసింది. గత వారం వాషింగ్టన్ హిల్‌టన్ హోటల్‌లో జరిగిన ఈ దాడికి సంబంధించిన ప్రతి దృశ్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.

New Update
cc tv

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేందుకు జరిగిన ప్రయత్నానికి సంబంధించి అమెరికా న్యాయ శాఖ షాకింగ్ వీడియో ఫుటేజీని విడుదల చేసింది. గత వారం వాషింగ్టన్ హిల్‌టన్ హోటల్‌లో జరిగిన ఈ దాడికి సంబంధించిన ప్రతి దృశ్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోలో 31 ఏళ్ల నిందితుడు కోల్ అలెన్ భద్రతా వలయాన్ని ఛేదించుకుని పారిపోవడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది. అంతటితో ఆగకుండా, తనను అడ్డుకోబోయిన ఒక సీక్రెట్ సర్వీస్ అధికారిపై అతను కాల్పులు జరిపాడు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అమెరికన్ అటార్నీ జీనిన్ పిరో సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోలోని కీలక అంశాలను వెల్లడించారు.

సుమారు ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో నిందితుడి పక్కా ప్లాన్ బయటపడింది.  దాడికి ఒక రోజు ముందే కోల్ అలెన్ హోటల్ పరిసరాల్లో రెక్కీ నిర్వహించాడు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సమయంలోనే ట్రంప్‌ను టార్గెట్ చేయాలని అతను భావించినట్లు తెలుస్తోంది. హోటల్ కారిడార్లు, ఫిట్‌నెస్ సెంటర్ సమీపంలో అతను అనుమానాస్పదంగా తిరుగుతూ, దాడికి సరైన సమయం కోసం వేచి చూసిన దృశ్యాలు సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మూడు రౌండ్లు కాల్పులు

అయితే ఈ వీడియోలో మరో కీలక అంశం ఏమిటంటే.. ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ నిందితుడిని ఆపేందుకు తన గన్ నుంచి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. పోలీసులు జరిపిన ఈ కాల్పుల్లో నిందితుడికి ఎటువంటి గాయాలు కాలేదని, అతను తృటిలో తప్పించుకున్నాడని స్పష్టమైంది. ఈ ఉత్కంఠభరితమైన సన్నివేశాలను న్యాయ శాఖ స్లో-మోషన్‌లో కూడా విడుదల చేసింది.

Advertisment
తాజా కథనాలు