UN: లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..200 మంది చిన్నారుల మృతి.

హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు విరుచుకుపడుతోంది. ఇప్పటికీ ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. దీని వలన ఇప్పటికి లెబనాన్‌లో 200 మంది పిల్లలు చనిపోయారని ఐక్యరాజ్యసమతి తెలిపింది. 

New Update
un

200 Kids Killed In Lebanon: 

గత రెండు నెలలుగా లెబనాన్‌లో ప్రతీ రోజూ ముగ్గురు పిల్లలు మరణిస్తున్నారని ఐక్యరాజ్యపమితి తెలిపింది. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పింది. ఈ హింసను ఆపడానికి చర్యలు తీసుకోవాలని యూనిసెఫ్ కోరింది. గాజాలో కూడా ఒకప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది అని ఇప్పుడు లెబనాన్ వంతు అని చెప్పింది.  గత పదిరోజులుగా అయితే ఇది మరీ ఎక్కువగా ఉందని యూనిసెఫ్ తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి మరణించిన 3,452 మందిలో 231 మంది పిల్లలు ఉన్నారు. గాయపడిన 14,664 మందిలో 1,330 మంది చిన్నారులు ఉన్నరని లెక్కలు చూపించింది. 

publive-image

un

ఇక మరోవైపు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గాజాలో ఇప్పటివరకు 17,400 మది పిల్లలు మరణించారని యూనిసెఫ్ తెలిపింది. గాజా, లెబనాన్‌లో జరిగిన యుద్ధం తట్టుకోలేని విధంగా ఉందని కామెంట్ చేసింది. దాంతో పాటూ రెండు దేశాల్లో వందల, వేల మంది పిల్లలు నిరాశ్రయులుగా, అనాథలుగా మిగిలిపోయారని...వారి భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా మారిందని యూనిసెఫ్ ఆవేదన వ్యక్తం చేసింది. గాజాలో జనసీవనం స్తంభించింది. పెవరికీ సరి అయిన తిండి లేదు, ఆరోగ్యం లేదు. పిల్లలకు స్కూళ్ళు లేవు. అక్కడ వారు ఎలా బతుకుతున్నారో కూడా అర్ధం కావడం లేద అంఓంది యూనిసెఫ్. వీటి మీద ఇకనైనా ఆయా దేశాలు శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందని..యుద్ధాన్ని ఆపేస్తే మంచిదని సూచించింది. 

publive-image

Also Read: USA: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్

 

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు