Space: నేలపై జాబిల్లి..రెండు నెలలు భూమిపై చందమామ వెకేషన్

చందమామ రావే, జాబిల్లి రావే అని తల్లులు పిల్లలకు చూపిస్తూ అన్నంతి నిపించక్కర్లేదు ఇక మీదట..డైరెక్ట్‌గా అన్నం తింటే చందమామనే ఇస్తా అని చెప్పొచ్చును. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా...అయితే ఇది చదవేయండి.

New Update
space

 Mini Moon: 


ఈ ఖగోళం అంతులేని విచిత్రాల సంపద. అందులో మనకు తెలిసింది చాలా అంటే చాలా కొంచెం. దీని అన్వేషణలో శాస్త్రవేత్తలు తరతరాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రతీసారి ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉన్నారు కూడా. ఇప్పుడు తాజాగా భూమి మీదకు చంద్రుడు వస్తాడు అని చెబుతున్నారు. అదేంటీ...భూమి, చంద్రుడు ఇంచుమించుగా ఒకే సైజులో ఉంటారు కదా...అదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారు కదా. అంటే జాబిల్లి అంటే నిజంగా చంద్రుడు కాదు..దానిలానే ఉండే చిన్న గ్రహశకలం భూమి మీదకు రాబోతోంది. అది గురుత్వాకర్షణ పరిధిలో సంచరిస్తుందని సైంటిస్టులు తెలిపారు. 

ఈ ఏడాది ఆగస్టు 7న పీటీ5 అనే గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పుడు ఇదే మరికొన్ని రోజులలో అంటే సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు భూమి చుట్టూ తిరుగుతుందని చెప్పారు. కేవలం 10 మీటర్ల (33 అడుగులు) వ్యాసం ఉంటుంది. ఇది భూమి చుట్టూ 53 రోజుల పాటు పరిభ్రమించనుంది. అదే వ్యవధిలో 2024 పీటీ5 పూర్తి కక్ష్యను చిట్టి చంద్రుడు పూర్తిచేయదు. దానికి బదులుగా అది భూమి గురుత్వాకర్షణ పరిధి నుంచి విడిపోనుంది. అయితే దీనిని మనం నేరుగా కానీ, టెలీస్కోప్‌లో కానీ మనం చూడలేము. కేవలం శాస్త్రవేత్తు మాత్రమే దీనిని చూడగలరు, స్టడీ చేయగలరు. గ్రహశకలాలు భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలా గ్రహశకలాలు చాలాసార్లే భూమి చుట్టూ తిరిగాయి.  ఈ గ్రహశకలాలు కొన్నిసార్లు మన గ్రహం చుట్టూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో తిరిగి .. కక్ష్యను పూర్తి చేసే ముందు భూమి దీర్ఘవృత్తాకార మార్గం నుంచి విడిపోతాయి. 

Also Read:  JOBS: 12 పాసయితే చాలు..రైల్వేలో 3445 ఉద్యోగాలు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు