Meta : మెటా షాకింగ్ నిర్ణయం...8వేల మందిపై వేటు

టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. సామాజిక మాధ్యమ దిగ్గజం, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. దీనితో 8,000 మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోనున్నారు.

New Update
FotoJet - 2026-04-24T111144.213

Meta's shocking decision...laying off 8,000 employees

 Meta : టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. సామాజిక మాధ్యమ దిగ్గజం, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ నిపుణులలో ఆందోళన కలిగిస్తోంది.మెటా తన మొత్తం గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే దాదాపు 8,000 మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోనున్నారు. ఈ మేరకు సంస్థ చీఫ్ పీపుల్ ఆఫీసర్ జనెల్ గేల్ ఇప్పటికే ఉద్యోగులకు అంతర్గత మెమోల ద్వారా సమాచారం అందించారు.

ఈ తొలగింపుల ప్రక్రియ మే 20న అధికారికంగా ప్రారంభం కానుంది. ఆ రోజున ప్రభావితమయ్యే ఉద్యోగుల వ్యక్తిగత మరియు వర్క్ ఈమెయిల్ ఐడీలకు లేఆఫ్ నోటీసులు అందనున్నాయి. అంతేకాకుండా, భవిష్యత్తులో భర్తీ చేయాలనుకున్న మరో 6,000 ఖాళీ పోస్టులను (Open Roles) కూడా సంస్థ రద్దు చేసింది.మెటా ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్న వ్యూహాత్మక కారణాలను వివరించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పోటీలో ముందుండటం కోసం, నిధులను ఏఐ రంగంలో పెట్టుబడిగా మళ్లించాలని మెటా భావిస్తోంది.  సంస్థ పనితీరును మరింత సరళతరం చేస్తూ, అదనపు ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.

 రానున్న రోజుల్లో ఈ లేఆఫ్స్ సంఖ్య 20 శాతానికి (అంటే మరో 8 వేల మంది) పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలగించబడిన ఉద్యోగులను ఆదుకోవడానికి మెటా కొన్ని కీలకమైన బెనిఫిట్స్ ప్రకటించింది.16 వారాల బేస్ వేతనంతో పాటు, సంస్థలో పనిచేసిన ప్రతి ఏటకి అదనంగా రెండు వారాల వేతనం చెల్లిస్తారు. అలాగే, 18 నెలల పాటు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తారు.ఆయా దేశాల్లో ఉన్న కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగులకు నష్టపరిహారం మరియు ఇతర ప్యాకేజీలు అందుతాయని మెటా స్పష్టం చేసింది. గతేడాది కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన మెటా, మళ్ళీ ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో లేఆఫ్స్ ప్రకటించడం టెక్ రంగంలో నెలకొన్న అనిశ్చితికి అద్దం పడుతోంది. ఏఐ వైపు మళ్లుతున్న క్రమంలో మానవ వనరుల అవసరం తగ్గుతుందనే సంకేతాన్ని ఈ చర్య ఇస్తోంది.

Advertisment
తాజా కథనాలు