రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టర్కీలో భారీ పేలుడు

టర్కీలోని అంకార సమీపంలోని టర్కీస్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (TUSAS) హెడ్‌క్వార్టర్స్‌ వద్ద ఉగ్రకాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ప్రాంతాంలో భారీ పేలుడు జరిగింది. తుపాకీ కాల్పులు కూడా జరిగాయి. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

New Update
Turkey

ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి టర్కీలోని అంకార సమీపంలోని టర్కీస్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (TUSAS) హెడ్‌క్వార్టర్స్‌ వద్ద ఉగ్రకాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ప్రాంతంలో భారీ పేలుడు జరిగింది. అలాగే ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు కూడా చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఘటనపై టర్కీ అంతర్గత మంత్రి అలీ యెర్లికయా ఎక్స్ వేదికగా స్పందించారు.

Also Read: మరో యుద్ధానికి సిద్ధం... రష్యా గడ్డపై నార్త్ కొరియా బలగాలు!

'' అంకర వద్ద కహ్రమంకజాన్‌లోని టర్కీస్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌పై ఉగ్రకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారని'' పేర్కొన్నారు. అయితే ఈ భారీ పేలుడు జరగడం, తుపాకుల కాల్పులకు గల కారణమెంటో ఇంతవరకు తెలియలేదు. అయితే అక్కడ ఆత్మహుతి దాడి చేసుకున్నట్లు పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ఇదిలా ఉండగా 2023లో కూడా అంకరాలోని అంతర్గత మంత్రిత్వశాఖ బిల్డింగ్‌ల ఎదుట ఇద్దరు ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ పేలుడు దాటికి వాళ్లలో ఒకరు చనిపోగా మరోకరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక 2016లోనే సిరియా సరిహద్దు ప్రాంతంలో ఉన్న టర్కిష్ పట్టణంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో కూడా ఆత్మహుతి దాడులు జరిగాయి. ఈ పేలుళ్ల దాటికి 50 మంది ప్రాణాలు కోల్పోయార. మరో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు