/rtv/media/media_files/2026/02/07/manhole-cover-thefts-2026-02-07-16-47-38.jpg)
Manhole Cover Thefts
Pakistan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌ను కొత్తగా మరో విషయం చిరాకు పెడుతోంది. కొందరు చిల్లర చోరులు మ్యాన్ హోల్స్‌పై మూతలను ఎత్తుకుపోవడం పెద్ద సమస్యగా మారింది. దొంగలు ‘‘మ్యాన్ హోల్స్’’పై మూతలు కూడా ఉంచకుండా, దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో విసిగిపోయిన పాకిస్తాన్, దీంతో చిన్న నేరమైనా పెద్ద శిక్ష వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మ్యాన్‌హోల్స్‌కు ఇలాంటి శిక్షలు ఏమిటి..? అని అనుకున్నా సరే, ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ మాత్రం శిక్షలు విధించేందుకు చట్టాన్ని తీసుకువచ్చింది. మ్యాన్ హోట్స్ మూతలు దొంగిలిస్తే శిక్షగా 10 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల పాకిస్తానీ రూపాయలు జరిమానా విధించనున్నారు. ఈ చట్టానికి ‘‘గట్టర్ చట్టం’’ అని పిలుస్తున్నారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియం నవాజ్ ఈ శిక్షల గురించి హెచ్చరిస్తూ మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతోంది.
ఇటీవల లాహోర్‌లోని భాటీ గేట్ సమీపంలో జరిగిన ఒక విషాద ఘటన ఈ చట్టానికి ప్రధాన కారణమైంది. ఇటీవల లాహోర్‌లోని దాతా దర్బార్ ప్రాంతంలో మూత లేని మ్యాన్‌హోల్‌లో పడి తల్లి, కుమార్తె మరణించారు. దీని తర్వాత పలు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలే జరిగాయి. సర్గోధాలో కూడా ఒక చిన్నారి మ్యాన్‌హోల్‌లో పడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనలపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. గటర్ మూతలను దొంగిలించినా, కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన శిక్షలు తప్పవని సీఎం మరియం నవాజ్ తీవ్ర హెచ్చరికలు చేశారు.
మ్యాన్ హోల్ మూతలు సుమారుగా 30 కిలోల ఐరన్ కలిగి ఉంటాయి. వీటిని దొంగిలించి అమ్మితే డబ్బులు వస్తుండటంతో , పాక్ వ్యాప్తంగా వీటి దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. మరోవైపు, పాకిస్తాన్ లో 45 శాతం పేదరికం ఉంది. ఇందులో 16.5 శాతం మంది తీవ్రమైన పేదరికంతో బాధపడుతున్నారు. దీంతో తమ ఇళ్లు గడవడానికి మ్యాన్ హోల్ మూతల్ని కూడా వదలడం లేదు. దీంతో పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం డ్రైనేజీ (మ్యాన్‌హోల్) మూతల దొంగతనాలను అరికట్టేందుకు అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఈ కొత్త నిబంధనలను ప్రకటిస్తూ, నిందితులకు భారీ జరిమానాలతో పాటు సుదీర్ఘ కాలం జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
‘‘మేము ఉదయం మూతల్ని బిగిస్తాము, సాయంత్రానికి అవి మాయమైపోతాయి. మురుగు కాలువ మూతల్ని దొంగిలించవద్దు’’ అని ఆమె కోరారు. మ్యాన్ హోల్స్ దొంగతనాలపై ఆమె విచారం వ్యక్తం చేశారు. “మ్యాన్‌హోల్ మూతలను దొంగిలించినా, అమ్మినా లేదా కొనుగోలు చేసినా వారికి 1 నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది, మరియు దానివల్ల ఎవరైనా మరణిస్తే, శిక్ష 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 50 లక్షల (పాకిస్థానీ రూపాయలు) వరకు జరిమానా విధించబడుతుంది,” అని ఆమె హెచ్చరించారు.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభం
పాకిస్థాన్‌లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో మ్యాన్ హోల్ మూతల దొంగతనాలకు కారణమవుతోందని ప్రచారం సాగుతోంది. అయితే దీన్ని పాక్ మీడియా వ్యతిరేకిస్తోంది. పాకిస్థాన్ మార్కెట్‌లో ఒక కొత్త మ్యాన్‌హోల్ మూత ధర రూ. 8,000 నుండి రూ. 12,000 వరకు ఉంటుంది. దీనికి ఉండే సుమారు 30 కిలోల బరువైన ఇనుప రింగ్ కోసం దొంగలు వీటిని ఎత్తుకెళ్తున్నారు. పాత ఇనుము మార్కెట్‌లో దీన్ని అమ్మితే వెంటనే నగదును ఇస్తుండటంతో, ఇది ఒక వ్యవస్థీకృత నేరంగా మారింది. 2025 డిసెంబర్‌లో డాన్ న్యూస్ ప్రచురించిన నివేదిక ప్రకారం, అక్రమ వ్యాపారంలో పాల్గొన్న సంస్థలపై రూ.100 కోట్ల వరకు జరిమానా విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇక చోరీలపై అప్రమత్తమైన ప్రభుత్వం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయనుంది. ప్రమాదకర ప్రాంతాల్లో నిఘా పెంచనున్నారు. నీటి సరఫరా, మురుగునీటి శాఖలకు గటర్ మూతలు మాయమైతే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
Follow Us