భారత్ దెబ్బ..మాల్దీవులు అబ్బా..డబ్బుల్లేక అధ్యక్షుడీ జీతంలో కోత

భారత్ దెబ్బకు మాల్దీవులు కుదేల్ అయింది. పర్యాటకరంగం తగ్గిపోవడంతో ఆ దేశం ఆర్ధిక పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. దీంతో ఏకంగా మాల్దీవుల అధ్యక్షుడు ఖర్చులోనే కోత పడిపోయింది.  225మందికి పైగా నేతలను పదవుల్లో నుంచి తొలగించారు.

New Update
Maldives Issue Row:మాల్దీవుల అధ్యక్షునిపై అవిశ్వానికి పిలుపునిచ్చిన ప్రతిపక్షం

 Maldives: 

ఒకప్పుడు పర్యాటక ప్రదేశాలతో కళకళలాడిన మాల్దీవులు ఇప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అనవసరంగా భారత్‌ను అవమానించి తలనొప్పులు తెచ్చుకుంది. భారత్ కొట్టిన ఎబ్బకు మాల్దీవుల్లో పర్యాటకం మొత్తం ఢమాల్ అంది. ఇది ఆదేశ ఆర్ధిక పరిస్థితిని దిగజార్జేసింది. దీంతో ఇపుడు మాల్దీవుల ప్రభుత్వం ఆర్ధిక సంస్కరణలను చేపట్టింది. ఇందులో భాగంగా...మాల్దీవుల అధ్యక్షుడు స్వయంగా తన ఖర్చును తగ్గించుకుంటున్నట్లు ప్రకటించారు. మహ్మద్ ముయిజ్జూ తన జీతంలో 50 శాతం మాత్రమే తీసుకుంటారని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. రుణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, మాల్దీవులలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కూడా కోత విధించనున్నారు. బ్యాంకులు మినహా అన్ని రాజకీయ నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలలో 10 శాతం కోత విధించనున్నారు. అయితే న్యాయమూర్తులు, ఎంపీలకు ఈ కోత నుంచి మినహాయింపు ఉంటుంది. మరోవైపు ఆర్ధిక భారాన్ని తగ్గించుకోవడానికి  అధ్యక్షుడు ముయిజ్జు రెండు వారాల క్రితం మంత్రులతో సహా 225 మందికి పైగా నేతలను తొలగించారు. తొలగించారు. వీరిలో ఏడుగురు రాష్ట్ర మంత్రులు, 43 మంది డిప్యూటీ మంత్రులు, 178 మంది రాజకీయ డైరెక్టర్లు ఉన్నారు. దీనివలన దేశం ప్రతి నెలా $370,000 ఆదా చేస్తుందని భావిస్తున్నారు.
 
ప్రస్తుతం మాల్దీవుల విదేశీ మారకద్రవ్య నిల్వలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయని ప్రపంచ బ్యాంకు తన తాజా గణాంకాల ప్రకారం చెప్పింది. విదేశీ రుణాల చెల్లింపు కారణంగా లిక్విడిటీ రిస్క్ పెరుగుతోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు 2017 నుంచి కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మాల్దీవుల వద్ద ఉన్న నిల్వలు ఒక నెల దిగుమతులకు మాత్రమే సరిపోతాయని తెలిపింది.  దీనంతటికీ కారణం మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు అనే అంటున్నారు. భారత్‌ను వ్యతిరేకించడం, అవమానించడం...చైనాకు దగ్గరయేందుకు ప్రయత్నాలు లాంటివి ఇప్పుడు ఆ దేశం కొంప ముంచుతున్నాయి. ఇందులో భాగంగా భారత్‌ను రెచ్చగొట్టారు. ఇక్కడ ఉన్న లక్షదీవులను కించపరుస్తూ మాట్లాడారు. దీంతో భారత్‌లో విపరీతంగా నిరసన వ్యక్తం అయింది.  ఆ దేశానికి అతి ముఖ్యమైన ఆర్థిక వనరు టూరిజం. మన దేశం నుంచి అత్యధికంగా పర్యటకులు ఆదేశానికి వెళ్లే వాళ్లు. మాల్దీవుల వైఖరి మీద వ్యతిరేకతతో ఇప్పుడు అక్కడకు వెళ్ళడం మానేస్తున్నారు. దీంతో ఆదేశ ఆర్ధిక పరిస్థితి క్షీణించింది.  

Also Read: USA: ట్రంప్ గెలిస్తే వీసాలు టైట్..ఐటీ కష్టాలు మళ్ళీ మొదటికి

Advertisment
Advertisment
తాజా కథనాలు