madhu yashki : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మధు యాష్కీ సతీమణి కారు పల్టీ!

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కుటుంబం అమెరికాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మధు యాష్కీ భార్య సుచి యాష్కీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ పల్టీలు కొట్టింది.

New Update
madhu

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కుటుంబం అమెరికాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మధు యాష్కీ భార్య సుచి యాష్కీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ పల్టీలు కొట్టింది. బోస్టన్ నుండి న్యూయార్క్ వస్తుండగా దారిలో విపరీతంగా వర్షం పడటంతో రోడ్డుపై కారు ఒక్కసారిగా స్కిడ్ అయి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మధు యాష్కీ భార్య సుచీకి పక్కటెముకలు విరిగినట్లు సమాచారం అందుతోంది. మధు యాష్కీ దంపతులు తమ కుమార్తె గగనను ఎండీ కోర్సులో జాయిన్ చేయడానికి అమెరికా వెళ్లారు. బోస్టన్‌లోని కాలేజీలో కూతురిని చేర్పించి, లగేజీతో తిరిగి న్యూయార్క్ వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 

ఇద్దరూ వేర్వేరు కార్లలో

లగేజీ ఎక్కువగా ఉండటంతో మధు యాష్కీ, ఆయన భార్య సుచి యాష్కీ ఇద్దరూ వేర్వేరు కార్లలో ప్రయాణించారు. సుచి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో మధు యాష్కీ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ కుటుంబం అంతా రేపు (గురువారం) ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. కానీ అంతలోనే ఈ ఊహించని ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆమెకు అమెరికాలోనే వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
 

Advertisment
తాజా కథనాలు