మంటల్లో హాలీవుడ్.. అసలేం జరిగింది? కార్చిచ్చుకు కారణం ఏంటి?

లాస్ ఏంజిల్స్‌ లో కార్చిచ్చు కారణం ఏంటి? టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికా ఈ అగ్ని ప్రమాదాలని ఎందుకు నివారించలేకపోతోంది? ఈ కార్చిచ్చుకు కారకులెవరు? తదితర ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ వీడియోను చూడండి.

New Update

అమెరికాలోని లాస్ ఏంజల్స్ ప్రకృతి సౌందర్యానికి నిలయం. ప్రపంచ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ- హాలీవుడ్ కు కేంద్రం.  ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కుబేరులు నివసించే ప్రాంతం ఇది. అలాంటి లాస్అంజలిస్ లోని పలు ప్రాంతాలు ఇప్పుడు మంటల్లో  తగలబడిపోతున్నాయి. విలాసవంతమైన విల్లాలు, కాస్ట్లీ రిసార్ట్ లు, భారీ బిల్డింగులు అగ్నికి ఆహుతి అవుతున్నాయ్. ఈ అగ్ని ప్రమాదాలు అడవులనే కాదు కాలనీలను బూడిద చేస్తున్నాయి. మనుషులు కూడా ఈ మంటల్లో సజీవ దహనం అవుతున్నారు. లక్షల మంది సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. లాస్ ఏంజిల్స్ ఇది కాలిఫోర్నియా రాష్టానికి దక్షిణ భాగంలో ఉంటుంది. ఇది  అమెరికాలోనే అత్యంత జనాభా కలిగిన రెండవ నగరం .

లాస్ ఎంజెలిస్ కార్చిచ్చుకు ఇప్పటికే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.  హాలీవుడ్ లోనీ అత్యంత ఖరీదైన భవనాలు, విల్లాలు మంటల్లో తగలబడి పోతున్నాయి.  పలువురు హీరోలు, హీరోయిన్లు, వ్యాపారవేత్తలకు చెందిన కాస్ట్లీ మాన్షన్స్, సినిమా స్టూడియోస్ కూడా ఇందులో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడైన హంటర్ బెయిడెన్ నివాసం కూడా కాలిపోయింది.
మన దేశానికి చెందిన బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఈ మంటల్లో చిక్కుకున్నారు. అయితే ఆమె అక్కడి నుంచి చాలా కష్టపడి సురక్షిత ప్రాంతానికి వెళ్లగలిగారు. ఇక్కడి మంటలు భయంకరంగా ఉన్నాయని, తృటిలో ప్రాణాల నుంచి బయటపడినట్లు ఆమె  చెప్పారు.

లాస్ ఎంజిల్స్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన ఈ అగ్ని ప్రమాదం వల్ల పదివేలకు పైగా భవనాలు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రాంతం నుంచి 4 లక్షల మందిని ఖాళీ చేయించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన బన్నీ మ్యూజియం పూర్తిగా దగ్ధమైంది. ఈ మంటలు అంతరిక్షంలోని ఉపగ్రహాలకు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ భారీ విపత్తు వల్ల 13 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. స్కూలు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. 10 వేల మంది ఫైర్ సిబ్బంది, 1000 ఫైర్ ఇంజన్లు ఈ మంటలను ఆర్పటానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. మరో 900 ఫైర్ ఫైటర్లను రంగంలోకి దించుతున్నారు. హెలికాప్టర్ల ద్వారా కూడా నీటిని చల్లుతున్నారు అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. మరింత మందిని ఖాళీ చేయించడానికి ఏర్పాటు జరుగుతున్నాయి.

మొదటిది పాలిసాడ్స్ ఫైర్

ఇక్కడ 34 వేల ఎకరాల్లో  అడవులు, ఊళ్ళు తగలబడుతున్నాయి. మాలిభూ తీరంలో ఉన్న పసిఫిక్ కోస్తా ప్రాంతంలో ఇండ్లు బిజినెస్ కాంప్లెక్స్ లు ఇతర భారీ భవనాలు తగలబడి పోతున్నాయి. మంటలు ఈ ప్రాంతాలను బూడిద కుప్పగా మార్చాయి. మంగళవారం అగ్నిప్రమాదం ఇక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా ఇల్లు, జంతువులు ఈ అగ్నికి ఆహుతి అయిపోయాయి.

రెండోది ఈటన్ ఫైర్: 

లాస్ట్ ఏంజెలిస్ కు చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాంతం. అల్టాడెనా- పాసడేనా  ప్రాంతంలో 15 వేల ఎకరాల్లో వేలాది ఇండ్లు, వ్యాపార సముదాయాలని దగ్ధం చేసింది ఫైర్. ఇది రెండో అతిపెద్ద అగ్ని ప్రమాదం 

మూడోది సన్సెట్ ఫైర్:

లాస్ ఎంజలిస్, వెంచురా కౌంటీస్ సరిహద్దులో 15 వందల ఎకరాల్లో దహించి వేసింది. శుక్రవారం ఉదయం నుంచి ఇక్కడ మంటలు చెలరేగుతున్నాయి. దాదాపు 70% కాలి బూడిద అయినట్టుగా అధికారులు చెబుతున్నారు.

నాలుగో ఆక్సిడెంట్  హర్స్ట్ ఫైర్: 

 లాస్ ఏంజిల్స్ కు పశ్చిమాన ఉన్న పర్వత ప్రాంతం ఆక్టర్ లో బుధవారం నుంచి మంటలు చెల రేగుతున్నాయి. 1000 ఎకరాల్లో అగ్ని విస్తరిస్తోంది. గురువారం రాత్రి నుంచి ఇక్కడ మంటలు చెలరేగటం మొదలైంది.

ఐదోడి లిడియా ఫైర్:

లాస్ట్ ఏంజల్స్ కు నార్త్ సైడ్ ఉన్న ఈ ప్రాంతంలో గురువారం అగ్ని ప్రమాదం మొదలైంది. ఇప్పటివరకు వేయి ఎకరాలకు పైగా అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రాంతంలో అణుబాంబు పడినట్టు కనిపిస్తోంది అని లాస్ ఎంజిల్స్ కౌంటి షరీఫ్ రాబర్ట్ లూనా కామెంట్ చేశారు.

ఈ అగ్ని ప్రమాదాలకు కారణమేంటి?

పొడి వాతావరణం,  వేడి గాలుల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. వర్షం అతి తక్కువగా అంటే కేవలం 0.4 సెంటీమీటర్లు మాత్రమే కురిసింది.  జూలై 2024 లో గత 150 సంవత్సరాల్లో అత్యల్ప వర్షపాతం ఇది. నేషనల్ వెదర్ సర్వీస్, నాసా ఎర్త్ అబ్జర్వేటరీ  ప్రకారం శాంతా అనా గాలులు,  వర్షపాతం లేకపోవడం ఈ అగ్ని ప్రమాదాలకు మూలకారణం. శాంతా ఆనా గాలులు దక్షిణ కాలిఫోర్నియా పర్వతాల గుండా  వీస్తున్నాయి. 1980 నుంచి కాలిఫోర్నియా సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగింది. ఎండిన వృక్షాలు అగ్ని ప్రమాదాన్నకి కారణం అవుతున్నాయి. విద్యుత్తు లైన్లు, చెక్కతో చేసిన టెలిఫోన్ స్తంభాలు, చెక్కతో నిర్మించిన గృహాలు ప్రమాదాన్ని కంట్రోల్ చేయలేని విధంగా మారుస్తున్నాయి. చెట్ల రాపిడి వల్ల కానీ లేదా ఎవరైనా సిగరెట్టు కాల్చి పడేయటం, వంట చేసి నిప్పు ఆర్పేయకపోవడం వంటి కారణాలతో మంటలు ఒక్కసారి అంటుకుంటే మొత్తం అడవిని దహించి వేస్తుంది. ఇక్కడ గాలులు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో విస్తున్నాయి. దానితో మంటలు అదుపు చేయడం కష్టం అవుతోంది.

2018లో జరిగిన అగ్ని ప్రమాదం అమెరికాలోనే అతి పెద్దదిగా చెప్పొచ్చు. ఆ రోజు  పేరడైజ్ అనే పట్టణాన్ని నాశనం చేసింది ఫైర్.  85 మందిని పొట్టన పెట్టుకుంది. చాలామంది కార్లలో పారిపోవడానికి ప్రయత్నించి మంటల్లో చిక్కుకొని కారులోనే చనిపోయారు. ఇప్పుడు మరి కొద్ది రోజులు ఈ వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నందున వెంటనే ఈ మంటలు చల్లారే అవకాశం కనిపించడం లేదు.

మంటలు కంట్రోల్ కాకపోవడం వల్ల ప్రజలు ఇళ్లకు తిరిగి రావద్దని లాస్ ఏంజిల్స్ కౌంటీ షరీఫ్ హెచ్చరించారు. అక్కడ వారం రోజులుగా కరెంటు లేదు. నీటి సరఫరా కూడా ఆగిపోయింది. ఓపెన్ గ్యాస్ లైన్లు వల్ల ప్రమాదం పొంచి ఉంది. ప్రజలు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళపోవడంతో కొందరు ఈ ఇళ్లను దోచుకుంటున్నారు. ఈ దోపిడీల నుంచి ఆస్తులను రక్షించడానికి పోలీసులు పెట్రోలింగ్ పెంచారు. ఇప్పటికే 20 మందిని అరెస్టు చేశారు. లాస్ ఏంజెలిస్ కౌంటిలో లక్ష బిల్డింగ్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లకు ప్రమాదం పొంచి ఉంది. మంటలతో వెలువడుతున్న పొగ కారణంగా గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. జనం మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ కలుషిత గాలి కారణంగా ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. అమెరికా భీమా కంపెనీలు ఈ కార్చిచ్చు తో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. జేపీ మోర్గాన్, మార్నింగ్ స్టార్ అంచనాల ప్రకారం 20 బిలియన్ డాలర్ల వరకు భీమా సంస్థలు నష్టపోతాయి. అమెరికా అధ్యక్షుడు జో బెయిడన్ ఈ మంటలను ఒక యుద్దంగా అభివర్ణించారు. మంటలను అదుపు చేయడంలో కొంత పురోగతి ఉన్న బలమైన గాలుల కారణంగా పూర్తిగా కంట్రోల్  చేయలేకపోతున్నామని చెప్పారు. అయితే వుడ్ ల్యాండ్ హిల్స్ లో కొత్తగా మంటలు చెలరేగినట్టు వస్తున్న వార్తలు మరింత  భయపెడుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు