/rtv/media/media_files/2026/06/12/godzilla-el-nino-2026-06-12-12-30-21.jpg)
Godzilla El Nino
ప్రపంచం మరోసారి ప్రమాదంలో పడింది. గత దశాబ్దాల్లో ఎన్నడూ చూడని రీతిలో అత్యంత శక్తిమంతమైన 'ఎల్నినో' తీవ్ర రూపం దాల్చబోతుందని అమెరికాకు చెందిన జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ మార్పు వల్ల ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఉష్ణోగ్రతలు, ప్రకృతి వైపరీత్యాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో దీనికి శాస్త్రవేత్తలు 'గాడ్జిలా ఎల్నినో' అని పేరు పెట్టారు. ఇంతకీ ఈ గాడ్జిలా ఎల్నినో అంటే ఏంటో చూద్దాం.
సాధారణంగా భూమధ్య రేఖ ప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్రం ఉపరితల జలాలు చల్లగా ఉంటాయి. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ జలాలు అసాధారణంగా వేడెక్కుతాయి. ఈ ప్రక్రియనే 'ఎల్నినో' అని పిలుస్తారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసాగర లోతుల్లోని వేడి నీరు ఉపరితలం వైపునకు ఉధృతంగా వస్తోంది. సాధారణంగా వచ్చే ఎల్నినోల కంటే ఇది డిఫరెంట్గా ఉండటంతో శాస్త్రవేత్తలు దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని 'గాడ్జిలా ఎల్నినో' అని పేరు పెట్టారు.
It’s the Geoengineering ⬇️
— Vectom (@Osbournegreen) June 11, 2026
Climate scientists fear this frequent weather event will become a 'Godzilla' or 'Super El Niño' by the end of the year
…severe droughts and crop failures around the world, contributing to more than 50 million deaths globally pic.twitter.com/dhQJkFAxgp
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై పరిశీలించే అమెరికాకు చెందిన 'నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్' ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉండబోతోందని హెచ్చరించింది. ఈ ఏడాది చివరలో ఈ వాతావరణ పోకడ అత్యంత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని తెలిపింది. 1950 తర్వాత నమోదైన అత్యంత శక్తిమంతమైన ఎల్నినోల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం 63 శాతం ఉందని నోవా గణాంకాలు చెబుతున్నాయి.
ఇది కూడా చూడండి:Ireland: : ఐర్లాండ్లో అల్లర్లు.. వలసదారులను లక్ష్యంగా చేసుకున్న హింస
ప్రస్తుతం భూమి ఇప్పటికే శిలాజ ఇంధనాల వినియోగం, పర్యావరణ కాలుష్యం కారణంగా 'గ్లోబల్ వార్మింగ్' సమస్యతో అల్లాడుతోంది. ఇప్పటికే భూమి వేడెక్కి ఉండగా.. ఇప్పుడు రాబోతున్న 'గాడ్జిలా' ఎల్నినో ఈ వేడిని మరింతగా పెంచనుంది. ఇది వాతావరణ సమతుల్యతను పూర్తిగా దెబ్బతీసి, ఉష్ణోగ్రతలను రికార్డు స్థాయికి చేర్చవచ్చని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా రుతుపవనాల గమనం దెబ్బతింటుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు తలెత్తుతాయి. ఇది వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసి, ఆహార భద్రతకు ముప్పు కలిగించవచ్చు. అంతేకాకుండా విపరీతమైన వేడి వల్ల వడదెబ్బ, అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉండటంతో ప్రజారోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. సముద్రపు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చేపల వేటపై కూడా దీని ప్రభావం ఉంటుంది.
Follow Us