/rtv/media/media_files/2025/07/19/kim-jong-un-2025-07-19-19-11-43.jpg)
kim jong un
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి తన పట్టును నిరూపించుకున్నారు. ఆ దేశ పార్లమెంటరీ వ్యవస్థ అయిన 'సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ' (SPA)కి ఈనెల 15న ఎన్నికలు జరిగాయి. తాజాగా విడుదలైన ఆ ఎన్నికల ఫలితాల్లో కిమ్ సారథ్యంలోని అధికార పార్టీ కళ్లు చెదిరే విజయాన్ని నమోదు చేసింది. దాదాపు 99.93 శాతం ఓట్లను సాధించి కిమ్ కూటమి క్లీన్ స్వీప్ చేసినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) వెల్లడించింది. ఆయన మాటే వేదంగా సాగే అక్కడ కూడా కిమ్‌కు 7శాతం మంది ప్రజలు ఎదురుతిగిగారు.
ఉత్తర కొరియాలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి 2026 మార్చి 15న పోలింగ్ జరిగింది. కిమ్ నేతృత్వంలోని 'వర్కర్స్ పార్టీ' ఇతర మిత్రపక్షాలతో కలిసి ఈ ఎన్నికల బరిలో నిలిచింది. అధికారిక లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా 99.99 శాతం పోలింగ్ నమోదైంది. కేవలం విదేశాల్లో ఉన్నవారు లేదా సముద్ర ప్రయాణాల్లో ఉన్న 0.0037 శాతం మంది మాత్రమే ఓటు వేయలేకపోయారు.
ప్రతిపక్షం లేని 'ప్రజాస్వామ్యం'
ఉత్తర కొరియా ఎన్నికల సరళి ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రతిపక్షం అనే మాటే వినిపించదు. బ్యాలెట్ పేపర్‌పై కేవలం ప్రభుత్వం ముందుగానే నిర్ణయించిన ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉంటుంది. ఓటర్లకు కేవలం రెండు ఆప్షన్లు మాత్రమే ఉంటాయి.
ఆ అభ్యర్థిని అంగీకరించడం.
ఆ అభ్యర్థిని తిరస్కరించడం.
విశేషమేమిటంటే, 1957 తర్వాత అభ్యర్థిని తిరస్కరించే (నో చెప్పే) అవకాశాన్ని కిమ్ సర్కార్ ఇప్పుడే కల్పించింది. అయితే, కిమ్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసే సాహసం అక్కడ ఎవరూ చేయరన్నది బహిరంగ రహస్యం. ఈ ఎన్నికల్లో మొత్తం 687 స్థానాలకు గాను అందరూ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వీరిలో కార్మికులు, మేధావులు, మిలిటరీ అధికారులు ఉండటం గమనార్హం.
తిరుగులేని నేతగా కిమ్
2011లో తండ్రి మరణానంతరం పగ్గాలు చేపట్టిన కిమ్ జాంగ్ ఉన్, అప్పటి నుండి దేశంపై ఉక్కుపాదం మోపుతున్నారు. అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న కిమ్, అంతర్గతంగా తన అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకే ఇటువంటి ఎన్నికలను నిర్వహిస్తుంటారు.
Follow Us