Mojtaba Khamenei : తీవ్రంగా గాయపడ్డ ఖమేనీ...కాలు తొలగింపు

ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య స్థితిపై అంతర్జాతీయ మీడియాలో వెలువడుతున్న కథనాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ముఖ్యంగా ముఖం,పెదవులు కాలిపోవడంతో కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారని సమాచారం.

New Update
Iran's new leader Mojtaba Khamenei secretly flown to Russia for surgery, says report

Mojtaba Khamenei

Mojtaba Khamenei : ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య స్థితిపై అంతర్జాతీయ మీడియాలో వెలువడుతున్న కథనాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ముఖ్యంగా ముఖం,పెదవులు కాలిపోవడంతో కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారని సమాచారం. ఈ క్రమంలో ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు 'ది న్యూయార్క్ టైమ్స్' వంటి అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి.

దాడుల ప్రభావంతో ఖమేనీ కాలికి తీవ్ర గాయమైందని, ఇప్పటివరకు మూడుసార్లు శస్త్రచికిత్సలు జరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయనకు కృత్రిమ కాలు (Prosthetic leg) అమర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన చేతికి కూడా శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆ గాయం మెరుగుపడుతోందని సమాచారం. అయితే, తాను శారీరకంగా బలహీనపడ్డాననే విషయం ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఆయన బహిరంగంగా కనిపించడం లేదని, అత్యంత రహస్య ప్రాంతంలో ఉండి చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది.

ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు దొరకకుండా ఉండేందుకు ఇరాన్ ప్రభుత్వం అత్యంత జాగ్రత్తలు వహిస్తోంది. ఎంతటి ఉన్నతాధికారులైనా ఖమేనీని నేరుగా కలిసేందుకు అనుమతించడం లేదని, కేవలం చేతితో రాసిన ఉత్తరాల ద్వారానే కమ్యూనికేషన్ జరుగుతోందని సమాచారం. ఈ ఉత్తరాలను మోటార్‌సైకిళ్లపై రహస్య ప్రాంతాలకు చేరవేస్తూ, డిజిటల్ సంకేతాలు ఏవీ బయటకు వెళ్లకుండా ఇరాన్ రక్షణ విభాగం పహారా కాస్తోంది.

దేశ పాలనలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు మొజ్తాబా ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) జనరల్స్‌తో కూడిన ఈ బోర్డుకు ఖమేనీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ.. యుద్ధం, జాతీయ భద్రత, దౌత్యపరమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీజ్ ఫైర్ నేపథ్యంలో అగ్రదేశాలతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న ఈ వార్తలు ఇరాన్ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు