Israel: యూనిట్‌ 8200 అంటే  ...ఇజ్రాయెల్‌ సీక్రెట్‌ వెపన్‌ ఇదేనా?

పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల వెనుక మొస్సాద్ తో పాటు ఇజ్రాయెల్ కు చెందిన ఓ రహస్య యూనిట్ పని చేసినట్లు తెలుస్తుంది. అదే యూనిట్ 8200. ఇజ్రాయెల్ రహస్య యూనిట్ 8200ను ‘యహిద షమోనే మతాయిమ్’ అని కూడా అంటారు.

New Update
Israel Army

Israel: గత మూడు రోజులుగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  లెబనాన్ లోని హెజ్బొల్లా తీవ్రవాదుల పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చేసిందనే అనుమానాలు ఈ ఆందోళనలకు కారణం అవుతున్నాయి. తాజాగా హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ నేరుగా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఆ సంస్థ స్థావరాలపై రాకెట్లతో దాడులు చేస్తోంది. దీంతో ఇది యుద్ధమేనంటోంది లెబనాన్. అసలు హెజ్బొల్లా పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ ఎలా పసిగట్టింది.. వాటిని ఎలా పేల్చేసింది..?పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్‌ అట్టుడికిన నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి దారుణంగా ఉంది. 

గాజాకు పరిమితమైన యుద్ధం లెబనాన్‌కూ విస్తరించిందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ హమాస్‌పై దృష్టి పెట్టిన ఇజ్రాయెల్, ఇప్పుడు హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తుంది.  ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా అధిపతి హసన్‌ నస్రల్లా గురువారం మాట్లాడారు. పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో ఇజ్రాయెల్‌ మరోసారి హద్దు మీరిందంటూ నస్రల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. నస్రల్లా ప్రసంగిస్తున్న సమయంలోనే దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరిపింది. అంతకుముందు హెజ్‌బొల్లా డ్రోన్‌ దాడులు చేసింది. 

ఇందులో ఇద్దరు ఇజ్రాయెల్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు లెబనాన్‌లో జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లలో చనిపోయిన వారి సంఖ్య 40 కి పెరిగింది. దాదాపు 3 వేల మందికి గాయాలైనట్లు సమాచారం. ఇందులో దాదాపు 300 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 

దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ – IDF వైమానిక దాడులు నిర్వహించింది. మరోవైపు అమెరికా కూడా అప్రమత్తమైంది. ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని హెజ్బొల్లా హెచ్చరించడంతో ప్రతి దాడులకు అమెరికా కూడా సమాయత్తమవుతోంది.

పేజర్లు, వాకీటాకీలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతుండడంతో వాటిపై లెబనాన్‌ నిషేధాన్ని విధించింది . పలు విమానయాన సంస్థలు కూడా వీటిని బ్యాన్ చేశాయి. పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్ అప్రమత్తమైంది. తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకెళ్లడాన్ని నిషేధించింది. ఖతర్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా బీరుట్‌ నుంచి రాకపోకలు సాగించే తమ విమానాల్లో పేజర్లు, వాకీటాకీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల వెనుక మొస్సాద్ తో పాటు ఇజ్రాయెల్ కు చెందిన ఓ రహస్య యూనిట్ పని చేసినట్లు తెలుస్తుంది. అదే యూనిట్ 8200. ఇజ్రాయెల్ రహస్య యూనిట్ 8200ను ‘యహిద షమోనే మతాయిమ్’ అని కూడా అంటారు.. ఈ యూనిట్‌లో ఎవరికి పడితే వారికి అవకాశం రాదు. యువ ప్రతిభావంతులకు.. సృజనాత్మకంగా ఆలోచించి, సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వారికి మాత్రమే ఇందులో ప్రవేశం ఉంటుంది. వీరికి హ్యాకింగ్, ఎన్‌క్రిప్షన్, నిఘా వంటి సంక్లిష్టమైన శిక్షణలు ఇస్తారు. ఈ యూనిట్‌ కార్యకలాపాలు దేశం బయట కూడా జరుగుతాయని నిఘా వర్గాల అంచనా.

Advertisment
Advertisment
తాజా కథనాలు