Israel: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 20 మంది మృతి.. సెంట్రల్ గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో చిన్నారులు తో పాటు 20 మంది మృతి చెందారు. అదే రోజు రాత్రి జరిగిన మరో దాడిలో నుసిరత్‌లోని ఇద్దరు మహిళలు చనిపోయారు. By Bhavana 14 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి పశ్చిమాసియాలో రోజురోజుకి యుద్దం తీవ్రతరం అవుతోంది. 'ఆదివారం రాత్రి సెంట్రల్ గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో చిన్నారులు తో పాటు 20 మంది మృతి చెందారు. అదే రోజు రాత్రి జరిగిన మరో దాడిలో నుసిరత్‌లోని ఇద్దరు మహిళలు చనిపోయారు. ఏడాదిగా జరుగుతున్న యుద్ధం వల్ల నిరాశ్రయులైన అనేక మంది పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించడం కోసం ఈ పాఠశాలను ఓ శరణార్థి శిబిరంగా మార్చరు. Also Read: రాజమౌళి, రానా విలన్ కాంబో మళ్లీ రిపీట్ కానుందా? కానీ ఈ పాఠశాలపైనే ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది' అని స్థానిక ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఈ దాడిలో చనిపోయినవారి మృతదేహాలను నుసైరత్‌లోని అల్-అవ్దా ఆసుపత్రికి, డీర్ అల్ బలాహ్లోని అల్-అక్సా ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. హెజ్బొల్లా డ్రోన్ దాడి ఓవైపు ఇజ్రాయెల్ సెంట్రల్ గాజాపై వైమానిక దాడి చేయగా, మరోవైపు సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని ఆర్మీ బేస్‌ను టార్గెట్ చేసుకుని హెజ్బొల్లా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో తమ సైనికులు నలుగురు మరణించారని, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. Also Read: ట్రంప్ ర్యాలీకి సమీపంలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్ అమెరికా 'థాడ్' పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ అయిన 'థాడ్'ను తమ మిత్రదేశం ఇజ్రాయెల్‌కు సరఫరా చేయాలని నిర్ణయించింది. థాడ్ వ్యవస్థను ఆపరేట్ చేయడానికి అమెరికా తన సైనికులను కూడా ఇజ్రాయెల్‌కు తరలించనుందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. Also Read: Hyderabad - Vijayawada Highway పై కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు థాడ్ సాయపడుతుందని పెంటగాన్ పేర్కొంది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు ఇజ్రాయెల్‌లో ఈ థాడ్ వ్యవస్థను మోహరించేందుకు రక్షణశాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అనుమతి ఇచ్చారని తెలిపింది. ఈ అమెరికా నిర్ణయంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ ఇజ్రాయెల్‌కు సాయం చేస్తే, అది ఇరాన్‌పై దాడికి పాల్పడినట్లేనని హెచ్చరికలు జారీ చేసింది. Also Read: మూసీలో కూల్చివేతలు...రేపటి నుంచే! #school #airstrike #Israeli attacks in Gaza మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి