/rtv/media/media_files/2026/05/29/fotojet-3-2026-05-29-13-08-46.jpg)
యుద్ధ ప్రాంతాల్లో మహిళల పట్ల జరుగుతున్న లైంగిక హింసపై ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా ఓ నివేదికను విడుదల చేస్తుంది. అయితే ఈసారి ఐరాస విడుదల చేసిన ఓ నివేదిక ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఎందుకంటే ఈ నివేదికలో తొలిసారిగా రష్యా, ఇజ్రాయెల్ సైన్యాల పేర్లను చేర్చడంపై ఆయా దేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. గత 15 ఏళ్లుగా ఈ నివేదికలో ఇజ్రాయెల్ పేరు ఎప్పుడూ లేదు. కానీ.. ప్రస్తుతం పాలస్తీనాలో ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న హింస, లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు ఆధారాలు ఉన్నాయని ఐరాస పేర్కొంది. ఇక రష్యా విషయానికొస్తే.. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైనికులు యుద్ధ ఖైదీలను, మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని ఐరాస ఆరోపించింది.
ఇది కూడా చూడండి: Raidurgam : రియల్ ఎస్టేట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రికార్డ్: రాయదుర్గంలో ఎకరం స్థలం రూ.237 కోట్లు!
Israeli and Russian forces added to UN blacklist for sexual violence in conflict zones https://t.co/J530Mw3Utj
— The San Juan Post (@TheSanJuanPost) May 29, 2026
ఇది కూడా చూడండి: CM Siddaramaiah : రాజ్యసభ ఆఫర్ రిజెక్ట్.. సిద్ధరామయ్య సంచలన ప్రకటన!
మండిపడుతున్న దేశాలు..
దీనివల్ల రష్యా సైన్యం పేరును కూడా ఈ నివేదికలో చేర్చారు. ఈ క్రమంలో ఇరు దేశాలు ఐరాస సెక్రటరీ జనరల్‌పై మండిపడుతున్నాయి. రష్యా ప్రతినిధి వెసెల్లీ నింబెంజియా ఈ నివేదిక పూర్తిగా రాజకీయ ప్రేరేపితం అని కొట్టిపారేశారు. రష్యాను అంతర్జాతీయ వేదికపై విలన్‌గా చిత్రీకరించేందుకు అబద్ధాలను నివేదికలో యాడ్ చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇజ్రాయెల్ ప్రతినిధి డానీ డానన్ మాట్లాడుతూ.. మా సైన్యం ప్రజాస్వామ్య విలువలతో పనిచేస్తుంది. మమ్మల్ని ఐసిస్ లేదా హమాస్ వంటి ఉగ్రవాద ముఠాలతో పోల్చడం ద్వారా ఐరాస తన గౌరవాన్ని తానే తగ్గించుకుంటోందని మండిపడ్డారు. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌తో ఇకపై తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.
ఇది కూడా చూడండి: CM Revanth Reddy : మాకు ఇందిరమ్మ ఎంతో.. NTR కూడా అంతే : సీఎం రేవంత్ రెడ్డి
Israel, Russia Added To UN Blacklist On Sexual Violence In Conflictshttps://t.co/P8MzgPvXJrpic.twitter.com/CM38WQwZ25
— NDTV WORLD (@NDTVWORLD) May 29, 2026
ఇది కూడా చూడండి: Japan : ఇండియాకు జపాన్ బిగ్ షాక్: ఈగలున్నాయని మామిడి పండ్లపై బ్యాన్!
Follow Us