బైకుల వెళ్ళే వీలుగా హెజ్బుల్లా బంకర్లు..వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ హమాస్‌తో యుద్ధం జరుగుతున్నప్పుడు వారి స్థావరాలు బంకర్లు ఫోటోలు, వీడియోలను విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం...తాజాగా హెజ్బుల్లా సొరంగాల వీడియోలను బయటపెట్టింది. రోడ్లు, ఇళ్ళు లాంటివి వాటితో ఈ బంకర్లు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. By Manogna alamuru 17 Oct 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hezbollah Tunnels: ప్రస్తుతం ఇజ్రాయెల్ తన ఫోకస్ అంతా హెజ్బుల్లాను నాశనం చేయడం మీదనే పెట్టింది. క్షిపణులు, భూతల దాడులతో హెజ్బుల్లా స్థావరాలను మట్టుబెడుతోంది ఐడీఎఫ్. ఇందులో భాగంగా హెజ్బుల్లా స్థావరాలైన బంకర్లు, సొరంగాలను ధ్వంసం చేస్తున్నారు. ఈక్రమంలో ఒక సొరంగం తాలూకా వీడియోను రిలీజ్ చేసింది. Also Read:TS: తెలంగాణలో భూ ఆక్రమణల నిరోధక చట్టం..ప్రభుత్వం కసరత్తు కింద ఉన్న వీడియోలో హెజ్బుల్లా ఉపయోగించిన ఒక సొరంగం. దీనికి ఇనుప తలుపులతో రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. ఇక లోపల ఫంక్షన్ రూమ్‌లు, ఏకే 47 రైఫిళ్లు, బెడ్రూం, బాత్రూం, స్టోర్ రూం, జనరేటర్, వాటర్ ట్యాంక్, బైక్‌లు లాంటివి కనిపించాయి. బంకర్లలో బైక్ ల మీ వెళ్ళగలిగేంత జాగా ఉండటమే కాకుండా అందుకు అనువైన రోడ్లు కడా కనిపించాయి. దాదాపు వంద మీటర్ల మేర ఈ సొరంగం ఉంది. హెజ్బుల్లా సంస్థ సభ్యులు ఈ సొరంగాల ద్వారానే ఒకచోట నుంచి మరోచోటికి ప్రయాణించేవారని...ఇజ్రాయెల్ దాడులను తప్పించుకునేవారని తెలుస్తోంది. INSIDE LOOK into a Hezbollah terrorist tunnel in southern Lebanon: pic.twitter.com/h3ZastZHxC — Israel Defense Forces (@IDF) October 15, 2024 Also Read: Hyderabad: అశోక్‌నర్‌లో హై టెన్షన్..రోడ్డెక్కిన గ్రూప్ 1 అభ్యర్థులు Also Read: శబరిమలకు రోజుకు 10వేల స్పాట్ బుకింగ్స్..తగ్గిన వర్చువల్ బుకింగ్స్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి