Israel: ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి..1981 నాటి ఆపరేషన్ ఒపేరాతో పోలిక ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్...ఇరాన్ మీద చేసిన దాడి ఆపరేషన్ ఒపేరాను గుర్తు చేస్తోందని అంతర్జాతీయ మీడియా అంటోంది. 1981లో ఇజ్రాయెల్ ఇలానే ఇరాక్ మీద దాడులను చేసిందని గుర్తు చేసింది. By Manogna alamuru 26 Oct 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Israel Attacks: ఇరాన్–ఇజ్రాయెల్ దాడి.. ఇరాక్–ఇరాన్ యుద్ధాన్ని గుర్తుచేస్తోంది. రీసెంట్‌గా హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాను ఇజ్రాయెల్ అంతం చేయడంతో ఇరాన్ ఆదేశం మీద దాడులు చేసింది. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడి అచ్చ 1981లో ఇరాక్‌పై ఇజ్రాయెల్ చేసిన ఆపరేషన్ ఒపేరాను గుర్తు చేస్తున్నాయి. 1981 నాటికి ఇజ్రాయెల్‌కు ఇంత సాంకేతిక లేదు. కానీ ఇరాక్‌లోని లక్ష్యాలను ఇజ్రాయెల్ సైన్యం అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. సుమారు 2000 కి.మీ దూరంలోని న్యూక్లియర్ రియాక్టర్‌ను శత్రుదేశాల కళ్లుగప్పి ధ్వంసం చేసింది. 1981, జూన్ 7 సాయంత్రం 4 గంటలకు ఆపరేషన్ ఒపేరాను మొదలుపెట్టింది. ఎట్జియాన్ విమానాశ్రయం నుంచి 14 ఫైటర్‌జట్‌లు ఒకేసారి టేకాఫ్ అయ్యాయి. సాయంత్రం 5.30 ప్రాంతంలో ఇరాక్‌లోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టన్‌ను ధ్వంసం చేశాయి. అదే సమయంలో ఇరాక్ చేసిన ఎదురుదాడిని తప్పించుకొని వెక్కు వచ్చేశాయి .అప్పట్లో ఇజ్రాయెల్ ఎఫ్-16ఏ యుద్ధవిమానాలను వినియోగించింది. వీటికి ఎస్కార్ట్‌గా ఎఫ్-15ఏ జెట్‌లు ఉండేవి. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ఇవే ఫైటర్ జెట్‌లను ఉపయోగిస్తోంది. రీసెటంగా ఇరాన్ మీద చేసిన దాడుల్లోనే ఇజ్రాయెల్ ఎఫ్–35 జెట్‌లను ఉపయోగించింది. ఇరాన్ రాడార్లకు దొరక్కుండా..తన క్షిపణులను ప్రయోగించింది. అందుకే ఈ దాడిని 1981 నాటి ఆపరేషన్ ఒపేరాను పోలి ఉందని అంటున్నారు. Also Read: ఆసక్తిగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు..ఇరు అభ్యర్ధుల మధ్య హోరాహోరీ పోటీ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి