Israel: ఇజ్రాయెల్ దగ్గర అతి పెద్ద బాంబ్..వణుకుతున్న ఇరాన్

ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతోంది. తాజాగా ఇరాన్...ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. దీంతో పాటూ ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు భయంకర దాడులకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇజ్రాయెల్ అయితే తన దగ్గర ఉన్న అతి పెద్ద బాంబును వాడడనికి కూడా సిద్ధమయిపోతోంది.

New Update

Israel-Iran War: 

ఇజ్రాయెల్‌ ప్రణాళికలు మాములగా ఉండవు.. ఒక టార్గెట్‌ ఫిక్స్ చేసుకున్నారంటే దాని కోసం ఎంత దూరమైనా వెళ్తారు. లెబనాన్‌లో పేజర్లు పేలిన ఘటన అయినా గాజా గడ్డపై ఇజ్రాయెల్‌ అమలు చేస్తున్న యుద్ధ వ్యూహాలైనా చూస్తే ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే! అటు ఇరాన్‌ను టైమ్‌ చూసి దెబ్బ కొట్టడం ఇజ్రాయెల్‌కే సాధ్యం. మరోసారి అదే ప్రూవ్‌ అయ్యింది. ఇరాన్‌ గడ్డపై ఇజ్రాయెల్‌ మిస్సైళ్ల వర్షాన్ని కురిపించింది. అటు ఇరాన్‌ కూడా ప్రతీకార చర్యలకు అస్త్రశస్త్రలను సిద్ధం చేసుకుంటోంది. ఇది పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ యుద్ధం ఎంత దూరం వెళ్తుందోనన్న భయాలు సర్వత్రా నెలకొన్నాయి.

అక్టోబరు 1, 2024- ఇరాన్ దాదాపు 200 క్షిపణులను ఇజ్రాయెల్ వైపు ప్రయోగించింది. ఇటివలి కాలంలో యూదు రాజ్యం పెర్షియన్ దేశం చేసిన అతి పెద్ద దాడి ఇది. ఈ దాడులకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్‌ తాజాగా ఇరాన్‌పై మిస్సైళ్ల వర్షం కురిపించింది. మరోవైపు ఇరాన్‌పై దాడి చేయడం ఇజ్రాయెల్‌కు అంత ఈజీ కాదు. దీనికి కారణం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భూమి దూరం ఎక్కువగా ఉంటుంది. ఇరాన్ దగ్గర అణు బాంబులు, బాలిస్టిక్ క్షిపణి స్థావరాలు భూమి లోపల సురక్షితంగా ఉన్నాయి. అలాగే, రష్యాకు చెందిన S-300 క్షిపణి నిరోధక వ్యవస్థను పోలిన వాయు రక్షణ సిస్టమ్‌ను ఇరాన్‌ సొంతంగా తయారు చేసుకుంది. అందుకే ఇజ్రాయెల్‌ సైతం ఇరాన్‌పై దాడి చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది.

నిజానికి ఇజ్రాయెల్ దగ్గర సుదూర క్షిపణులు ఉన్నాయి. ఇక ఇజ్రాయెల్ ర్యాంపేజ్ క్షిపణి మొదట ఆకాశం నుంచి నేలపై లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించారు. ఈ రకమైన క్షిపణి ఇరాన్‌పై దాడి చేయడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. ఏదైనా ఫైటర్ జెట్ నుంచి లక్ష్యాలను ఛేదించడానికి వీటిని ఉపయోగించవచ్చు. ఇది కాకుండా ఇజ్రాయెల్ వద్ద ఎల్బిట్ అనే బంకర్ బస్టింగ్ బాంబు కూడా ఉంది. ఈ క్షిపణి 4 మీటర్ల వరకు కాంక్రీట్‌ను ఛేదించగలదు. వీటిని F-15I జెట్‌తో అమర్చవచ్చు. ఇక వీటితో ఇజ్రాయెల్ వద్ద 1500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉన్న పొపాయ్ టర్బో క్రూయిజ్ క్షిపణిని కూడా కలిగి ఉంది. దీన్ని ఇజ్రాయెల్ జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు.

ఇక తాజాగా జరిగిన పెలుళ్లు టెహ్రాన్ సమీపంలోని కరాజ్ నగరం చుట్టూ జరిగింది. కనీసం ఏడు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని కరాజ్‌ చుట్టుపక్కల ప్రాంతాలన్ని వణికిపోతునన్నాయని టెహ్రాన్ నివాసి అసోసియేటెడ్ ప్రెస్‌తో చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం కూడా సిరియాలోని పలు ప్రాంతాలపై దాడులు ప్రారంభించింది. దక్షిణ-మధ్య సిరియాలోని అనేక సైనిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. అటు పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడులు ఎప్పటిలాగనే కొనసాగాయి. దక్షిణ గాజా స్ట్రిప్ నగరం ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో కనీసం 38 మంది మరణించారు. ఇజ్రాయెల్ దళాలు ఒక ఆసుపత్రిపై జరిపిన దాడుల్లో పాలస్తీనా పౌరులు మరణించడం అక్కడ విషాదాన్ని నింపింది.

ఇరాన్​పై ఎలాంటి దాడి చేసినా దీటుగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ అధికారులు ఇజ్రాయెల్‌ను ఇప్పటికే పదేపదే హెచ్చరిస్తున్నారు. అటు ఇజ్రాయెల్‌కు హాని తలపెట్టేందుకు ప్రయత్నిస్తే శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌​లోని టార్గెట్స్‌పై దాడులకు ముందు అమెరికాకు ఇజ్రాయెల్ సమాచారం ఇచ్చిందని, అయితే ఈ ఆపరేషన్‌​లో తాము పాల్గొనలేదని అమెరికా అధికారి ఒకరు ప్రముఖ వార్త సంస్థ రాయిటర్స్‌కు చెప్పారు.

2024 అక్టోబర్ 1తో పాటు ఈ ఏప్రిల్‌లో కూడా వందకు పైగా క్షిపణులను ఇజ్రాయెల్ మీదికి ప్రయోగించింది ఇరాన్. ఆ దాడుల సమయంలో ఇజ్రాయెల్ తన వద్దనున్న అన్ని రకాల మిసైల్ నిరోధక వ్యవస్థలను ఉపయోగించింది. ఇరాన్ దాడులకు ప్రతి చర్య తప్పదని అప్పుడే ఐడీఎఫ్ అధికారులు చెప్పారు. ఇలా రివెంజ్‌లో భాగంగానే ఇజ్రాయెల్‌ ఇరాన్‌ను టార్గెట్‌ చేసినట్టుగా అర్థమవుతోంది.

Also Read: India: ప్రాణాలతో చెలగాటం..49శాతం ఫేక్ మెడిసన్స్..

 

Advertisment
Advertisment
తాజా కథనాలు