లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి.. 100 మంది మృతి లెబనాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఓ భారీ అపార్ట్‌మెంట్‌పై రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో క్షణాల్లోనే ఆ భారీ భవనం కుప్పకూలింది. ఈ విషాద ఘటనలో 100 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 200 మంది గాయాలపాలయ్యారు. By B Aravind 21 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి హెజ్‌బొల్లా దళాలను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ లెబనాన్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. రోజురోజుకు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో హెజ్‌బొల్లా కుదేలవుతుంది. ఇప్పటికే ఆ సంస్థ అధినేతలు హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్‌తో పాటు పలువురు కీలక నేతలు కూడా ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందారు. అపార్ట్‌మెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ వరుసగా దాడులు చేస్తూ వస్తోంది. అయితే తాజాగా ఓ భారీ అపార్ట్‌మెంట్‌పై రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో క్షణాల్లోనే ఆ భారీ భవనం కుప్పకూలింది. ఈ విషాద ఘటనలో 100 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 200 మంది గాయాలపాలయ్యారు. Also Read: Maldives వెళ్లాలనుకునే.. భారత యాత్రికులకు గుడ్ న్యూస్ గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు శరీర భాగాలు చెల్లచెదురుగా పడ్డాయి. దీంతో మృతులను గుర్తుపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడులతో ప్రజల హాహాకారల వల్ల ఘటనాస్థలంలో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. వారంలో మూడోసారి బిల్డింగ్స్‌పై క్షిపణలతో విరుచుకుబడింది. ఒక దాడి నుంచి కోలుకోకముందే మరో దాడికి పాల్పడుతోంది. Also Read: నవంబర్ 1-19 మధ్య ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు! జనావాసాల్లోనే ఉగ్ర కార్యకలాపాలు మరోవైపు హెజ్‌బొల్లా ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థికంగా సపోర్ట్ చేసే ప్రాంతాలకు సమీపంలో ఉంటున్న ప్రజలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. లెబనాన్ వ్యాప్తంగా ఉన్నటువంటి 'అల్ ఖర్ద్ అల్ హసన్' బ్రాంచీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని చెప్పింది. అయితే అల్ ఖర్ద్ అల్ హసన్ అనేది లైసెన్స్ లేని గ్రే-మార్కెట్ బ్యాంక్. ప్రస్తుతం హెజ్‌బొల్లాకు నిధులు సమకూర్చేందుకు ప్రధాన ఆర్థిక వనరుగా పనిచేస్తోంది. లెబనాన్‌లో దీనికి దాదాపు 30 బ్రాంచీలు ఉన్నాయి. ఇందులో సగం బీరుట్‌లోని రద్దీ అయిన ప్రదేశాలు, జనావాస ప్రాంతాల్లోనే ఉన్నాయి. #israel #hezbollah #lebanon మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి