Israel: ఇజ్రాయెల్ ఉగ్రరూపం..హెజ్బుల్లా సర్వనాశనం దిశగా దాడులు హెజ్బుల్లాను సమూలంగా నాశనం చేసేంత వరకూ వదిలిపెట్టనంటోంది ఇజ్రాయెల్. ఇప్పటి వరకూ చేసిన దాడులు ఒక లెక్క ఇక మీదట చేసే మరో లెక్క అని హెచ్చరిస్తోంది. అందుకు తగ్గట్టుగానే బీరుట్‌లో హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై రాకెట్లు, క్షిపణులు వర్షం కురిపించింది. By Manogna alamuru 08 Oct 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Israel Attack On Hezbollah: హెజ్బుల్లాకు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇజ్రాయెల్ ఆ సంస్థ మీద తన ఉగ్రరూపం చూపిస్తోంది. హమాస్, హెజ్బుల్లాల్లో కీలక నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ హమాస్‌పై భారీస్థాయిలో విరుచుకుపడుతోంది. అక్టోబర్ 7తో గాజా యుద్ధానికి ఏడాది పూర్తవడంతో హమాస్, బీరుట్‌పై ఏకకాలంలో బాంబుల వర్షం కురిపించింది. బీరుట్‌లోని హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై రాకెట్లు, క్షిపణులతో భీకర దాడులు చేసింది ఇజ్రాయెల్. సుమారు మూడు గంటల పాటు రాకెట్ల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో హెజ్బుల్లా కీలక కమాండర్ సోహిన్ హొసైన్ హొసైనీ హతం అయ్యారని తెలుస్తోంది. అతనితో పాటూ వందల మంది హెజ్బుల్లా మిలిటెంట్స్ కూడా మృతి చెందారు. మరోవైపు ఇజ్రాయెల్ రాకెట్ల దాడికి హెజ్బుల్లా ప్రధాన కార్యాలయం ముక్కలు ముక్కలైంది. ఇంటెలిజెన్స్ విభాగం అందించిన కచ్చితమైన సమాచారంతో ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు చేసింది.కీలక నేతలు సమావేశమయ్యారనే పక్కా సమాచారం ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఇప్పటికే హెజ్బుల్లా చీఫ్ నస్రుల్లా, హెజ్బుల్లా నంబర్2 అఖిల్‌తోపాటు మరికొంత మంది కమాండర్లు హతం అయ్యారు. ఇప్పుడు మరో కీలక నేతనుకూడా మట్టుబెట్టింది. మరోవైపు హమాస్‌పై కూడా బాంబులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. గాజాలోని ఓ మసీదు, ఓ పాఠశాలపై దాడులు చేసింది. ఇందులో సుమారు 50 మందికిపైగా మృతి చెందారని సమాచారం. మరి కొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో అత్యధికంగా చిన్నారులు, మహిళలే ఉన్నారని తెలుస్తోంది. అయితే తాము హమాస్ మిలిటెంట్ నేతలే లక్ష్యంగా.. దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. తమ దాడిలో పాలస్తీనియన్లు కూడా చనిపోయారని విచారం వ్యక్తం చేసింది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి