/rtv/media/media_files/2026/03/17/trump-2026-03-17-10-39-52.jpg)
ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీపై సంచలన ఆరోపణలు బయటకు వస్తున్నాయి. 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ స్వలింగ సంపర్కి అయి ఉండవచ్చని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ నివేదికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించిన తీరు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఇంటెలిజెన్స్ అధికారులు ట్రంప్ కు ఈ సమాచారాన్ని చెప్పగానే ట్రంప్ ఒక్కసారిగా ఆశ్చర్యపోవడమే కాకుండా, పెద్ద పెట్టున నవ్వారని నివేదిక పేర్కొంది. గత కొన్ని రోజులుగా ఆయన దీనిపై నవ్వుతూనే ఉన్నారని, ఇది నమ్మశక్యంగా లేదంటూ అన్నట్లుగా వ్యాఖ్యానించారని సమాచారం.
చిన్ననాటి ట్యూటర్‌తో లైంగిక సంబంధం
అమెరికన్ గూఢచారి సంస్థలు ఈ సమాచారాన్ని కేవలం తప్పుడు ప్రచారంగా కొట్టిపారేయడం లేదు. దీనిని నమ్మదగ్గ సమాచారం గానే పరిగణిస్తున్నట్లు ముగ్గురు ఉన్నతాధికారులు తెలిపారు. మొజ్తబాకు తన చిన్ననాటి ట్యూటర్‌తో దీర్ఘకాలికంగా లైంగిక సంబంధం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. గతంలో వారి కుటుంబంలో పనిచేసిన ఒక వ్యక్తితో కూడా ఆయనకు సాన్నిహిత్యం ఉందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల్లో మొజ్తబా గాయపడ్డారు. కోలుకుంటున్న సమయంలో ఆయన తన సంరక్షణ చూస్తున్న పురుష సిబ్బంది పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారని సమాచారం.
మొజ్తబా వ్యక్తిగత జీవితం గురించి ఇరాన్‌లో గత కొంతకాలంగా రకరకాల పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. మొజ్తబా నపుంసకత్వ సమస్యతో బాధపడుతూ లండన్‌లోని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నారని తెలుస్తోంది. ముప్పై ఏళ్ల వయసు వచ్చే వరకు ఆయన వివాహం చేసుకోకపోవడం, ఆ తర్వాత చికిత్స తీసుకున్న తర్వాతే ఆయన భార్య గర్భం దాల్చడం వంటి అంశాలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన తర్వాత, అలీ ఖమేనీ తన కుమారుడిని వారసుడిగా ఎంపిక చేయడానికి మొజ్తబా వ్యక్తిగత జీవితంలోని కొన్ని సమస్యలే అడ్డంకిగా మారాయని అప్పట్లో వార్తలు వచ్చాయి.
కాగా ఇరాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో స్వలింగ సంపర్కం నేరం. దీనికి కఠినమైన శిక్షలతో పాటు మరణశిక్ష కూడా విధిస్తారు. అటువంటి దేశానికి నాయకుడిగా ఉన్న వ్యక్తిపైనే ఈ తరహా ఆరోపణలు రావడం అనేది అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. కాగా ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో మరణించిన తర్వాత, ఆయన రెండో కుమారుడైన మొజ్తబా ఖమేనీ మార్చి 8వ తేదీన ఆ పీఠాన్ని అధిష్టించారు.
Follow Us