/rtv/media/media_files/2026/05/25/mojtaba-khamenei-2026-05-25-15-25-33.jpg)
Mojtaba Khamenei
Mojtaba Khamenei : అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటించినప్పటికీ, 'హార్ముజ్ జలసంధి' వద్ద ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఒక రహస్య ప్రాంతంలో తలదాచుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేని ఒక సురక్షిత ప్రాంతం నుండి ఆయన పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
కొరియర్ నెట్‌వర్క్ ద్వారానే సందేశాలు
ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అమెరికా అధికారుల సమాచారం ప్రకారం.. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని సంప్రదించడానికి కేవలం 'కొరియర్ నెట్‌వర్క్' (మానవ రాయబారులు) మాత్రమే అందుబాటులో ఉంది. ట్రంప్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు అధికారిక ముద్ర పొందిన ఇరాన్ ఉన్నతాధికారులు సైతం తమ సొంత ప్రభుత్వ వ్యవస్థలోనే ఒకరినొకరు సంప్రదించుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.అమెరికా శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రతిపాదనల వివరాలను ఇరాన్‌కు పంపినప్పుడు, అవి సుప్రీం లీడర్‌కు చేరడానికి చాలా సమయం పడుతోంది. ఫలితంగా అమెరికాకు ఇరాన్ నుండి వచ్చే సమాధానాలు విపరీతంగా ఆలస్యమవుతున్నాయి. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే శాంతి చర్చలు చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు సిబిఎస్ (CBS) నివేదిక పేర్కొంది.
నేరుగా సంప్రదించే మార్గం లేదు
ఇరాన్ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులకు సైతం సుప్రీం లీడర్ ఎక్కడ ఉన్నారనే ఖచ్చితమైన సమాచారం లేదు. ఆయనను నేరుగా ఫోన్ ద్వారా లేదా డిజిటల్ మార్గాల్లో సంప్రదించే అవకాశం ఎవరికీ లేదు. సుప్రీం లీడర్ ఉన్న లొకేషన్‌ను అత్యంత రహస్యంగా ఉంచడం కోసం ఒక ప్రత్యేక కొరియర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ పద్ధతి వల్ల అమెరికాకు ఇరాన్ నుండి లభిస్తున్న సమాచారం పాతబడిపోతోంది (Outdated), అలాగే ఖమేనీ ఇచ్చే స్పందనల్లో తీవ్ర ఆలస్యం జరుగుతోంది.
ప్రజల ముందుకు రాని ఖమేనీ
గతంలో జరిగిన యుద్ధ సమయంలో ఇరాన్ సీనియర్ నాయకత్వ స్థానాలను ట్రాక్ చేసి, వారిని నిర్మూలించడంలో అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విజయవంతమయ్యాయి. ఇరాన్ అంతర్గత వ్యవస్థల నుంచే లీక్ అయిన సమాచారమే ఇందుకు కారణమని అమెరికా భావిస్తోంది. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury) లో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లు నిఘా వర్గాల సమాచారం.
Follow Us