/rtv/media/media_files/2026/03/06/iran-war-2026-03-06-15-57-34.jpg)
A Iran usa, israel war
kuwait airport attacked : అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ధీటుగా సమాధానమిస్తోంది. ఇజ్రాయెల్ పై దాడులు కొనసాగిస్తూనే అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలను ఊచకోత కోస్తుంది. తాజాగా కువైట్ ఎయిర్‌పోర్టుపై భీకర దాడి చేసింది.ఎయిర్‌పోర్టులోని ఫ్యుయల్ ట్యాంకర్ టార్గెట్‌గా దాడి జరిగింది. విమానాశ్రయం పై డ్రోన్ దాడులు చేసినట్లు తాజా సమాచారం అందుతోంది. బుధవారం (మార్చి 25) తెల్లవారుజామున ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు కువైట్ విమానాశ్రయంలోని ఒక చమురు ట్యాంక్ (Fuel Tank) ను లక్ష్యంగా చేసుకున్నాయి.
ఫ్యుయల్ ట్యాంకర్ పేలడంతో ఎయిర్‌పోర్టులో భారీగా మంటలు చెలరేగాయి.భారీ BLASTతో భయంతో ప్రయాణీకులు పరుగులు తీశారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. విమానాశ్రయ అధికారులు వెంటనే అత్యవసర ప్రోటోకాల్స్‌ను అమలు చేసి, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కువైట్ పౌర విమానయాన శాఖ (DGCA) ప్రకారము, ఆస్తి నష్టం పరిమితంగానే ఉందని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. దుబాయ్, సౌదీ, ఖతార్, బహ్రెయిన్‌పై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపించింది. ఇరాన్ భీకర దాడులతో ట్రంప్‌పై గల్ఫ్ దేశాల ఒత్తిడి పెరిగింది. ఇరాన్ దెబ్బకు ట్రంప్, నెతన్యాహు పిచ్చెక్కిపోతున్నారు.
ఫిబ్రవరి 28, 2026న ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం మొదలైనప్పటి నుండి కువైట్ విమానాశ్రయం, ఇతర చమురు కేంద్రాలపై పలుమార్లు దాడులు జరిగాయి: మార్చి 14న విమానాశ్రయ రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగింది.మార్చి 8న చమురు నిల్వ కేంద్రాలపై దాడులు జరిగాయి. కువైట్‌లోని మినా అల్-అహ్మదీ రిఫైనరీ , అలీ అల్ సలేం ఎయిర్ బేస్ కూడా ఈ దాడులకు గురయ్యాయి.అమెరికా మరియు ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడులు చేస్తున్న క్రమంలో, ఇరాన్ తన పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలను (కువైట్, యూఏఈ, బహ్రెయిన్ వంటివి) లక్ష్యంగా చేసుకుంటోంది. కువైట్ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. తమ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు ఉపయోగించనివ్వడం లేదని స్పష్టం చేసింది.
మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో ఇరుదేశాల్లో రక్తపాతం చోటు చేసుకుంటోంది. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కౌంటర్ అటాక్ ఇచ్చింది.టెల్ అవీవ్‌పై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపించింది.ఇరాన్ దాడుల్లో ఓ పసిపాప సహా ఆరుగురు మృతి చెందారు. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ మరోసారి రెచ్చిపోయింది. తాజాగా ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తుంది.భీకర దాడులు చేస్తూనే చర్చలు నడుస్తున్నాయంటూ ట్రంప్ డ్రామాలు. ఇరాన్ సర్వం కోల్పోయిందన్న ట్రంప్.ఇరాన్ దగ్గర కోల్పోవడానికి ఏం లేదంటూ వ్యాఖ్యానించారు.ఓటమిని అంగీకరించి సరెండర్ అవడమే ఇరాన్ ముందున్న మార్గం అంటూ ట్రంప్ స్పష్టం చేశారు.
Follow Us