మాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు–ఇరాన్ కమాండర్ వార్నింగ్

మాపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదు అంటూ హెచ్చరించారు ఐఆర్‌‌జీసీ ఛీఫ్ హసన్ సలామీ. జనరల్‌ అబ్బాస్‌ నీలోఫర్సన్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం దేశాలను ఎవరూ ఏమీ చేయలేరని హసన్ అన్నారు. 

author-image
By Manogna alamuru
New Update
iran

Iran Strong Warning: 

ఇజ్రాయెల్‌తో ఇరాన్ ఢీ అంటే ఢీ అంటోంది. మొదటి నుంచి ఇజ్రాయెల్‌కు స్ట్రాంగ్ రిప్లైలు ఇస్తున్న ఇరాన్...మరోసారి ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ మీద దాడులు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ కమాండర్ హసన్ సలామీ వార్నింగ్ ఇచ్చారు. పొరపాటున అయినా మా ప్రాంతాల మీ దాడి జరిగిందో..అంతే సంగతులు అంటూ హెచ్చరించారు. ముస్లిందేశాలను అంత ఈజీగా తీసుకోవద్దని అన్నారు. మా దేశాలను ఎవరూ ఏం చేయలేరని...దాడులు చేస్తే...వారు సురక్షితంగా ఉండలేరని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు సలామీ. అంతేకాదు ఇజ్రాయెల్ అమెరికాను నమ్ముకుని దాడులకు పాల్పడుతోందని...కానీ ఆ దేశం సరఫరా చేసే రక్షణ వ్యవస్థ అంత స్ట్రాంగేమీ కాదని హసన్ అన్నారు. అమెరికా పంపించిన థాడ్ మిస్సైల్ ఢిఫెన్స్ వ్యవస్థ ఏ మాత్రం ఆధారపడదగినది కాదని ఆయన విమర్శించారు. 

Also Read:IRCTC:ఐఆర్సీటీసీలో కీలక మార్పు..అడ్వాన్స్ బుకింగ్స్ 60 రోజులకు కుదింపు

ముస్లిం దేశాల మద్దతు..

మరోవైపు ఇరాన్ మిగతా ముస్లిం దేశాల మద్దతును కూడా నెమ్మదిగా కూడగట్టుకుంటోంది. ఇజ్రాయెల్ దాడులను దౌత్యపరంగా ఎదుర్కొనేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి పశ్చిమాసియాదేశాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా ఆయన కైరోలోని ఈజిప్టు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటికే సౌదీ అరేబియా, ఖతార్, ఇరాక్ లాంటి దేశాలు ఇరాన్‌కు మద్దతు పలికాయి. అంతకుముందు సౌదీ ఆరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌, ఖతార్ సహా గల్ఫ్‌ దేశాలన్ని అమెరికాతో లాబీయింగ్ చేశాయి. ఇరాన్ చమురు కేంద్రాలపై దాడి చేయకుండా ఇజ్రాయెల్‌ను నిరోధించాలని అమెరికాను కోరాయి. దాడులు ఆపకపోతే తమ దేశాల గగనతలం ఉపయోగించుకోకుండా ఇజ్రాయెల్‌పై నిషేధం విధిస్తామని కూడా హెచ్చరించాయి.

ఇది కూడా చదవండి: TGPSC GROUP-1: గ్రూప్-1 మెయిన్స్ పై సీఎస్ కీలక ఆదేశాలు!

మిత్ర దేశాలకూ వార్నింగ్..

ఇరాన్ ఇదే వార్నింగ్‌ను ఇంతకు ముందు అమెరికా మరికొన్ని ఇజ్రాయెల్ మిత్రదేశాలకు కూడా వార్నింగ్ ఇచ్చింది.  ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇజ్రాయెల్‌కు సాయం చేస్తే ఇరాన్‌పై దాడికి పాల్పడినట్లేనని వార్నింగ్ ఇచ్చింది. ఇదే కానీ జరిగితే టెహ్రాన్‌ కూడా తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. తమ శత్రు దేశమైన ఇజ్రాయెల్‌కు సహకరిస్తే.. తమపై దాడి చేసినట్లుగానే భావిస్తామని తెలిపింది. 

ఇది కూడా చదవండి:'విశ్వం' సక్సెస్ కోసం కావ్య థాపర్ ఇలా చేసిందంటే నమ్ముతారా!

ఇది కూడా చదవండి:Telangana: తెలంగాణలో మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ !

Advertisment
Advertisment
తాజా కథనాలు