Iran: విమానంలో రక్తంతో తడిసిన బ్యాగులు, బూట్లు.. ఇరాన్ ఎమోషనల్ పోస్ట్!

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న చర్చలు అత్యంత ఉద్వేగభరితంగా మారాయి. ఈ చర్చల కోసం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ నేతృత్వంలోని మినాబ్ 168 ప్రతినిధి బృందం శనివారం తెల్లవారుజామున ఇస్లామాబాద్ చేరుకుంది.

New Update
iran

Iran: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న చర్చలు అత్యంత ఉద్వేగభరితంగా మారాయి. ఈ చర్చల కోసం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ నేతృత్వంలోని మినాబ్ 168 ప్రతినిధి బృందం శనివారం తెల్లవారుజామున ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే, ఈ బృందం తమతో పాటు అమెరికా క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయిన పాఠశాల విద్యార్థుల జ్ఞాపకాలను వెంట తెచ్చుకోవడం అందరినీ కలిచివేసింది.

Also Read: మంగ్లీపై పంజాగుట్టలో కేసు నమోదు.. బెదిరిస్తుందని లాయర్ ఫిర్యాదు!

ఇరాన్ ప్రతినిధి బృందం ప్రయాణించిన విమానంలో కొన్ని సీట్లను కేవలం అమెరికా క్షిపణి దాడిలో మరణించిన విద్యార్థుల కోసం కేటాయించారు. ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఉన్న షజ్రే తయ్యెబె పాఠశాలపై గత ఫిబ్రవరి 28న అమెరికా జరిపిన టోమాహాక్ క్షిపణి దాడిలో సుమారు 165 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, వారిలో ఎక్కువ మంది చిన్నపిల్లలే. ఈ దారుణ ఘటనలో చనిపోయిన విద్యార్థుల స్కూల్ బ్యాగులు, బూట్లు, వారి ఫోటోలను విమాన సీట్లలో ఉంచి, వాటి పక్కన పూలు పెట్టి ఘాలిబాఫ్ నివాళులు అర్పించారు. శాంతి చర్చల ప్రయాణంలో ఈ చిన్నారులే తన సహచరులని ఆయన భావోద్వేగంగా ట్వీట్ చేశారు. పాత నిఘా సమాచారం వల్లే పొరపాటున పాఠశాల మీద దాడి జరిగిందని అమెరికా సైన్యం ప్రాథమిక దర్యాప్తులో అంగీకరించింది.

Also Read:'కాంతారా 3'కి బ్రేక్ పడిందా..? రిషబ్ శెట్టి ప్రాజెక్ట్‌పై కొత్త ట్విస్ట్!

షరతులను అమెరికా అంగీకరించాలని    

ఇస్లామాబాద్ చేరుకున్న ఇరాన్ బృందంలో రాజకీయ, సైనిక, ఆర్థిక, న్యాయ నిపుణులు ఉన్నారు. అయితే, చర్చలు మొదలవ్వాలంటే తాము పెట్టిన ముందస్తు షరతులను అమెరికా అంగీకరించాలని ఘాలిబాఫ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా లెబనాన్‌లో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని,  అమెరికా ఆంక్షల వల్ల నిలిచిపోయిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ హామీలు నెరవేరితేనే చర్చలు ముందుకు సాగుతాయని ఇరాన్ గట్టిగా చెబుతోంది.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చల ఫలితంపై పూర్తి ధీమాతో ఉన్నారు. చర్చలకు నాయకత్వం వహిస్తున్న వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌కు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇరాన్ సైనిక పరంగా ఓడిపోయిందని, కాబట్టి శాంతి చర్చలకు రాక తప్పదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే, ప్రస్తుతం మూతపడిన హార్ముజ్ జలసంధిని ఇరాన్ సహకరించినా చేయకపోయినా తాము తెరిచి తీరుతామని ఆయన గట్టిగా చెప్పారు. ఒకవైపు చిన్నారుల మరణాల ఆవేదన, మరోవైపు యుద్ధ మేఘాల మధ్య జరుగుతున్న ఈ చర్చలు ప్రపంచ దేశాల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు