IRAN DEMANDING : గల్ఫ్‌ దేశాలకు ఇరాన్ షాక్..నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌

ఇరాన్‌-అమెరికా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఆ నష్టాన్ని గల్ఫ్ దేశాలు చెల్లించాలని  ఇరాన్‌ డిమాండ్‌ చేసింది. యుద్ధంలో US ఇజ్రాయెల్‌కు గల్ఫ్‌దేశాలు సహకరించాయని అందువల్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.

New Update
FotoJet (72)

IRAN DEMANDING

IRAN DEMANDING:  ఇరాన్‌-అమెరికా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం మూలంగా తాము తీవ్రంగా నష్టపోయామని ఆ నష్టాన్ని గల్ఫ్ దేశాలు చెల్లించాలని  ఇరాన్‌ డిమాండ్‌ చేసింది.యుద్ధంలో US ఇజ్రాయెల్‌కు గల్ఫ్‌ దేశాలు సహకరించాయని అందువల్ల గల్ఫ్‌ దేశాలైన బహ్రెయిన్, సౌదీ, ఖతార్, UAE, జోర్డాన్‌ల నుంచి..నష్టపరిహారం ఇప్పించాలని ఐక్యరాజ్యసమితికి ఇరాన్ విజ్ఞప్తి చేసింది.గల్ఫ్‌ దేశాల వల్లే తమపై దాడులు జరిగాయని ఇరాన్ వాదించడం సంచలనంగా మారింది. గల్ఫ్‌ దేశాలు కూడా దాడులకు బాధ్యత వహించాలని ఇరాన్ డిమాండ్‌ చేసింది.

ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో  కువైట్, ఒమన్ పేర్లను ఇరాన్‌ ఎక్కడ  ప్రస్తావించక పోవడం గమనార్హం.--- ఇరాన్‌కు ఒమన్, కువైట్ మధ్య మంచి సంబంధాలు ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది.--- గల్ఫ్ దేశాలన్నీ ఒక్కటైతే మొదటికే మోసం వస్తుందని ఇరాన్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఇరాన్‌ డిమాండ్‌ను గల్ఫ్ దేశాలు ఒప్పుకుంటాయా లేదా అనేది ఉత్కంఠ  నెలకొంది.ఇరాన్ డిమాండ్స్‌ను ఒప్పుకుంటే గల్ఫ్ ప్రాంతాల్లో దాడులు తగ్గే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇరాన్ కోరుకునే పరిహారం

* యుద్ధంతో జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారం
* US ఆంక్షలు తొలగించేలా గల్ఫ్ దేశాలపై ఒత్తిడి
* ఆయిల్ మార్కెట్‌లో సహకారం
* పెట్టుబడులు & ట్రేడ్ రిలేషన్స్
* భద్రతాపరమైన హామీలు 

ఇరాన్‌ డిమాండ్ ఎందుకు..?

* అమెరికా ఆంక్షలతో భారీగా ఆర్థిక నష్టం
* USకు గల్ఫ్‌ దేశాల సహకారం
* ఆయిల్‌ మార్కెట్‌లో నష్టం
* US మిలిటరీ బేస్‌లతో భద్రత ముప్పు
* గల్ఫ్‌ దేశాలపై ఒత్తిడితో అంతర్జాతీయంగా సింపతి  

ఇరాన్‌పై యుద్ధం ఎఫెక్ట్‌

* పడిపోయిన ఆయిల్ అమ్మకాలు 
* కరెన్సీ పతనం, పెరిగిన ద్రవ్యోల్బణం 
* పెరిగిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & మిలిటరీ ఖర్చులు
* తగ్గిన విదేశీ పెట్టుబడులు 
* తగ్గిన ఉద్యోగాలు, పెరిగిన ధరలు  

ఇరాన్‌ వల్ల గల్ఫ్ దేశాలకు నష్టం

* దెబ్బతిన్న ఆయిల్ ప్లాంట్స్‌
* తగ్గిన ఆయిల్ ఉత్పత్తి 
* షిప్పింగ్ సమస్యలు  
* పెరిగిన సెక్యూరిటీ ఖర్చులు 
* ఎకానమీపై ఇంపాక్ట్‌

Advertisment
తాజా కథనాలు