IRAN :‘ఇరాన్‌ నాగరికతను సైకో హెచ్చరికలు ముగించలేవు’..ట్రంప్ కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

నేటి రాత్రి ఒక నాగరికత అంతమైపోవచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌పై ఇరాన్ అంతే స్ట్రాంగ్‌గా సమాధానమిచ్చింది. అమెరికా, దాని మిత్రదేశాలను ప్రాచీన ఇరాన్ నాగరికత ఎన్నడూ మర్చిపోలేని విధంగా దెబ్బకొడుతుందని తీవ్రస్థాయిలో హెచ్చరించింది.

New Update
donald trump

Iran response To Trump warning

IRAN : యుద్ధం మొదలైనప్పటినుంచి కూడా అమెరికాకు ఏ మాత్రం తలవంచక, దాని హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న ఇరాన్‌ మరొసారి తన పౌరుషాన్ని ప్రదర్శించింది. నేటి రాత్రి ఒక నాగరికత అంతమైపోవచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌పై అంతే స్ట్రాంగ్‌గా సమాధానమిచ్చింది. అమెరికా, దాని మిత్రదేశాలను ప్రాచీన ఇరాన్ నాగరికత ఎన్నడూ మర్చిపోలేని విధంగా దెబ్బకొడుతుందని తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఈ మేరకు దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ ఓ పోస్టు పెట్టింది.

ట్రంప్ వ్యాఖ్యలపై తుర్కియేలోని ఇరాన్ ఎంబసీ మరింత ఘాటుగా స్పందించింది. సైకో హెచ్చరికలను లెక్కచేయబోమని తేల్చి చెప్పింది. చరిత్రలో ఎన్ని దాడులు జరిగినా ఇరాన్ నాగరికత ఇప్పటికీ నిలిచే ఉందని పేర్కొంది. ‘అలెగ్జాండర్ ఈ నాగరికతను తగలబెట్టాడు. మంగోలులు దోచుకున్నారు. కాలం ఎన్నో పరీక్షలు పెట్టింది. ఇరాన్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. కాలానికే ఎదురు నిలిచిన ఇరాన్‌ నాగరికతను సైకో హెచ్చరికలు ముగించలేవు’ అని ఇరాన్ ఎంబసీ సమాధానం ఇవ్వడం గమనార్హం.

మరోవైపు ట్రంప్ ట్వీట్‌పై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఖలీబాఫ్ ఘాటుగా రిప్లై ఇచ్చారు.ఇరాన్‌ వైపు ఎవడైనా వేలెత్తి చూపినా లేదా...లొంగిపోవాలంటూ బెదిరించినా..ఆ వేలిని నరికేస్తామంటూ ట్వీట్ చేశారు. ఇరాన్‌ కోసం ప్రాణత్యాగానికి సిద్ధమంటూ ఖలీబాఫ్ ట్వీట్ చేశారు. 14 కోట్ల మంది ఇరాన్‌ కోసం స్వచ్ఛందంగా ప్రాణాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా రని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రజలందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారంటూ సంకేతం ఇచ్చారు. ఇరాన్ సైనిక పరంగా యుద్ధానికి రెడీగా ఉన్నట్లు సిగ్నల్స్‌ ఇవ్వడమే కాకుండా  ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ ఇరాన్ టాప్ లీడర్స్ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నారు.లొంగిపోయే కంటే పోరాడి చావడమే మేలనే వైఖరిని ఇరాన్ ప్రదర్శిస్తుంది. రాబోయే 10 గంటలు ప్రపంచ చరిత్రలో కీలకంగా మారనుంది. ఇండియన్‌ కాలమానం ప్రకారం రేపు తెల్లవారుజామున...5 గంటల 30 నిమిషాలకు ట్రంప్ డెడ్‌లైన్ ముగియనుంది.

కాగా, నేటి రాత్రి ఇరాన్ నాగరికత అంతమైపోవచ్చని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించిన విషయం తెలిసిందే.  ప్రపంచ చరిత్రలో ఇవి అత్యంత ముఖ్యమైన క్షణాలని ట్రంప్‌ పేర్కొన్నారు. 47 ఏళ్లుగా సాగిన అరాచకాలకు ముగింపు పడనుందని కూడా ట్రంప్‌ చెప్పారు. ఇరాన్ పాలకుల నుంచి మంచి నిర్ణయం వెలువడవచ్చని కూడా వ్యాఖ్యానించారు.  

కాగా, ఇరాన్‌లో మౌలికవసతులను టార్గెట్ చేస్తామని ట్రంప్ పేర్కొనడంపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. పౌర వసతులపై దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఆయన హెచ్చరించారు. కాగా అమెరికా ప్రతిపాదిత కాల్పుల విరమణ తమకు అంగీకారం కాదని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకాలని, మళ్లీ దాడులు జరగవన్న హామీ కావాలని ఇరాన్‌ పట్టుబడుతోంది. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లో ఏం జరగబోతున్నదనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisment
తాజా కథనాలు