/rtv/media/media_files/2026/03/10/fake-fighter-jets-2026-03-10-13-35-47.jpg)
కొట్లాటలో కేవలం భుజ బలం ఉంటే సరిపోదు.. బుద్ధి బలం ఉండాలని అంటుంటారు. దూకుడు సినిమాలో మన మహేష్ బాబు కూడా ఇదే మాట "కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాగ్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు" అని డైలాగ్ రూపంలో చెప్పాడు. యుద్ధంలో కేవలం ఆయుధ బలం ఉంటే సరిపోదు, శత్రువును బురిడీ కొట్టించే తెలివితేటలు కూడా ఉండాలని ఇరాన్ నిరూపిస్తోంది. ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్ కూటమితో నడుస్తున్న ఉద్రిక్తతల్లో ఇరాన్ అనుసరిస్తున్న 'ఫేక్ ఫైటర్ జెట్ల’ వ్యూహం అగ్రరాజ్యానికి భారీ ఆర్థిక నష్టాన్ని మిగులుస్తోంది. యుద్ధంలో శత్రువును గందరగోళానికి గురిచేయడం పాత ప్లానే అయినా, ఇరాన్ దీనిని కొత్త పుంతలు తొక్కించింది. అత్యాధునిక క్షిపణులను వాడుతున్న అమెరికా సేనలను ముప్పుతిప్పలు పెట్టేందుకు ఇరాన్ "డెకాయ్" వార్ ప్లాన్ వాడుతోంది.
Be like Iran.
— 🕵️GEM DETECTER🕵️ (@gem_detecter) March 6, 2026
They painted fake fighter jets on airport runways, forcing the U.S. to spend millions of dollars bombing decoys. pic.twitter.com/k8r0xEgl4B
లక్షల డాలర్ల మిస్సైల్స్ Vs వేల రూపాయల బొమ్మలు
ఇరాన్ చైనా నుండి దాదాపు 9 లక్షల మేర గాలి నింపే ఫేక్ ఫైటర్ జెట్లను దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. ఇందులో ట్యాంకులు, క్షిపణి లాంచర్లు, యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవి శాటిలైట్, రాడార్లలో అచ్చం అసలు యుద్ధ విమానాల లాగే కనిపిస్తాయి. ఇరాన్ తన అసలైన యుద్ధ విమానాలను సురక్షితమైన భూగర్భ బంకర్లలో దాచిపెట్టి, రన్ వేలపై ఈ నకిలీ రబ్బరు విమానాలను ఉంచుతోంది. వాటిపై అగ్రరాజ్యం అమెరికా లక్షల డాలర్లు ఖర్చు చేసి మిస్సైల్స్ ప్రయోగిస్తోంది. ఇలా అమెరికాకి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తూ ఇరాన్ స్ట్రాటజిక్‌గా యుద్ధంలో పైచేయి సాధిస్తోంది. అమెరికాకు చెందిన ఒక్కో 'పేట్రియాట్' క్షిపణి ధర సుమారు 20 నుండి 50 లక్షల డాలర్లు (దాదాపు 16 నుండి 40 కోట్ల రూపాయలు) ఉంటుంది. అయితే, ఇరాన్ కేవలం కొన్ని వేల రూపాయల ఖర్చుతో చెక్క, ప్లాస్టిక్ లేదా గాలితో నింపిన నకిలీ యుద్ధ విమానాలు, ట్యాంకులు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను సరిహద్దుల్లో మోహరించింది. అమెరికా క్షిపణులు ఈ నకిలీ లక్ష్యాలను ఢీకొట్టినప్పుడు కేవలం గాలి నింపిన బొమ్మలు మాత్రమే ధ్వంసమవుతున్నాయి. దీనివల్ల అమెరికాకు కోట్లాది రూపాయల ధననష్టం వాటిల్లడమే కాకుండా, తమ ఆయుధ నిల్వలు కూడా అనవసరంగా ఖర్చవుతున్నాయి.
🚨 BREAKING 🇮🇷🇮🇱🇺🇸
— China live (@ChinaliveX) March 7, 2026
Iran bought millions of ‘Fake’ military equipments, fighter jets, air Defense, Tanks and fighter jets from China to trap American and Israeli airforce. pic.twitter.com/wpmzB9sfEL
AIతో సవాలు
ఇటీవల ఇజ్రాయెల్ విడుదల చేసిన కొన్ని వీడియోలలో హెలికాప్టర్లపై దాడులు జరిగినట్లు చూపించినప్పటికీ, పేలుడు తర్వాత కూడా ఆ విమానాల ఆకారం చెక్కుచెదరకుండా ఉండటం గమనార్హం. ఇది ఫేక్ టార్గెట్ వల్లే జరిగిందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, కొన్ని వార్తా సంస్థలు ఇవి AI ద్వారా సృష్టించబడిన చిత్రాలని కూడా హెచ్చరిస్తున్నాయి. ఏదేమైనా, "తక్కువ ఖర్చుతో కూడిన మోసం అత్యంత ఖరీదైన వైఫల్యం" అనే సూత్రం ఇక్కడ అమెరికాను వేధిస్తోంది.
ఈ రోజుల్లో యుద్ధం కేవలం క్షిపణుల మధ్యే కాకుండా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, స్ట్రాటజిక్ వార్ ప్లాన్స్‌తో కూడా జరుగుతోంది. ఇరాన్ అమలు చేస్తున్న ఈ స్ట్రాటజిక్ ప్లాన్ వల్ల అమెరికాకు లక్షల డాలర్లు వృదా అవుతున్నాయి.
ఇరాన్ అమలు చేస్తున్న వినూత్న వ్యూహాలు:
3D పెయింటింగ్‌లు: రన్‌వేలపై ఫైటర్ జెట్లను పోలిన 3D పెయింటింగ్ వేయడంతో గాలిలో నుండి చూసే డ్రోన్లకు అవి నిజమైన విమానాల్లా కనిపిస్తున్నాయి.
థర్మల్ హీటర్లు: మిస్సైల్స్ వేడిని గుర్తించి దాడి చేస్తాయి. దీనిని అడ్డుకోవడానికి ఇరాన్ నకిలీ విమానాల లోపల చిన్నపాటి హీటర్లను ఉంచి, అవి నిజమైన ఇంజిన్ వేడిని విడుదల చేస్తున్నట్లు సృష్టిస్తున్నాయి.
చైనా సహకారం: చైనా నుంచి అందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇరాన్ ఈ అత్యాధునిక నకిలీ యుద్ధ పరికరాలను తయారు చేస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Follow Us