BIG BREAKING : ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్... హోర్ముజ్ ను క్లోజ్ చేసిన ఇరాన్!

ఇరాన్ సైన్యం కీలక ప్రకటన చేసింది. అమెరికా తమ మాట తప్పిందని ఆరోపిస్తూ ప్రపంచ దేశాలకు ఎంతో ముఖ్యమైన హోర్ముజ్ జలసంధిపై మళ్లీ కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) స్పష్టం చేసింది.

New Update
donald

ఇరాన్ సైన్యం కీలక ప్రకటన చేసింది. అమెరికా తమ మాట తప్పిందని ఆరోపిస్తూ ప్రపంచ దేశాలకు ఎంతో ముఖ్యమైన హోర్ముజ్ జలసంధిపై మళ్లీ కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) స్పష్టం చేసింది. లెబనాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత, శుక్రవారమే ఈ మార్గాన్ని ఇరాన్ తెరిచినప్పటికీ.. అమెరికా విధిస్తున్న నౌకా దళ దిగ్బంధనం కారణంగా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా తన హామీలను నెరవేర్చలేదని, ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని కొనసాగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సైనిక కమాండ్ తెలిపింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ ఉద్రిక్తతకు ప్రధాన కారణంగా మారాయి. ఇరాన్‌తో పూర్తిస్థాయి అణు ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకా దళం తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి తెరుచుకోవడాన్ని ఆయన స్వాగతించినప్పటికీ, ఇరాన్‌కు సంబంధించిన నౌకల రాకపోకలపై మాత్రం ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఇరాన్, అమెరికా చేస్తున్నది సముద్రపు దొంగతనం అని మండిపడింది. తమ నౌకలకు పూర్తి స్వేచ్ఛ కల్పించే వరకు హోర్ముజ్ జలసంధిని తమ గుప్పిట్లోనే ఉంచుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. 

ఈ నేపథ్యంలో, ఇరాన్ పార్లమెంటరీ కమిటీ అధినేత ఇబ్రహీం అజీజి ఒక సంచలన ప్రకటన చేశారు. ఇకపై తమ అనుమతి ఉన్న వాణిజ్య నౌకలను మాత్రమే ఈ మార్గం గుండా వెళ్లనిస్తామని, వారు తప్పనిసరిగా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. మరోవైపు ఇరాన్ స్పీకర్ మహ్మద్ బాకర్ కలిబాఫ్ మాట్లాడుతూ.. అమెరికా దిగ్బంధనం కొనసాగితే ఈ మార్గం ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదని, రాకపోకలు అన్నీ ఇరాన్ నిర్దేశించిన రూట్లలోనే జరగాలని తేల్చి చెప్పారు.

47 రోజుల పాటు క్లోజ్

ప్రపంచానికి అవసరమైన చమురు, గ్యాస్ సరఫరాలో 20 శాతం వాటా ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఆ తర్వాత ఇరాన్ ఎదురుదాడి చేయడంతో దాదాపు 47 రోజుల పాటు ఈ మార్గం మూతపడింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు మళ్లీ ఇరాన్ ఈ జలసంధిపై పట్టు బిగించడంతో అంతర్జాతీయ వాణిజ్యానికి పెద్ద ముప్పు పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లోక్‌సభలో ప్రతిపక్షాలు మహిళా బిల్లును అడ్డుకోవడంతో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 8:30 గంటలకు ఆయన దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మహిళా రిజర్వేషన్లపై ప్రతిపక్షాల తీరును తప్పుబడుతూ, ఈ విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి అడుగుల గురించి ఆయన వివరించే అవకాశం ఉంది. ప్రధాని ప్రసంగంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 

Advertisment
తాజా కథనాలు