NOPO force: ఎవరీ 'నోపో' కమాండోలు? ఇరాన్ స్పెషల్ ఫోర్స్ సీక్రెట్ ఇదే!

ఇరాన్ రాజకీయాల్లో అత్యున్నత పదవిని చేపట్టిన మొజ్తాబా ఖమేనీ సెక్యూరిటీ గురించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆయనకు రక్షణ కవచంలా నిలుస్తున్న 'నోపో' ఫోర్స్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

New Update
_NOPO force

ఇరాన్ రాజకీయాల్లో అత్యున్నత పదవిని చేపట్టిన మొజ్తాబా ఖమేనీ సెక్యూరిటీ గురించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆయనకు రక్షణ కవచంలా నిలుస్తున్న 'నోపో' ఫోర్స్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్లాక్ యూనిఫాంలో అత్యాధునిక ఆయుధాలతో కనిపించే ఈ దళం ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన, రహస్య విభాగంగా పేరుగాంచింది.

నోపో అంటే.. 

NOPO అంటే పర్షియన్ భాషలో Niru-ye Vizhe-ye Pasban-e Velayat అని అర్థం. దీనిని ఇంగ్లీష్‌లో స్పెషల్ ఫోర్స్ ఆఫ్ గార్డియన్స్ ఆఫ్ ది వెలాయత్ అని పిలుస్తారు. ఇది ఇరాన్ పోలీసు విభాగంలోని స్పెషల్ ఫోర్స్‌లో ఓ అంతర్భాగం. అయితే, ఇది నార్మల్ పోలీసు డ్యూటీస్ కంటే భిన్నంగా ఉంటుంది. నెపో ఫోర్స్ హైలెవల్ అఫిషియల్స్‌కు సెక్యూరిటీ, అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ల కోసం మాత్రమే పనిచేస్తుంది.

'బ్లాక్-క్లాడ్' ఫోర్స్ ప్రత్యేకత

ఈ దళ సభ్యులు తల నుండి కాలి వరకు బ్లాక్ డ్రస్, మాస్కులు ధరిస్తారు. అందుకే వీరిని "బ్లాక్-క్లాడ్ ఫోర్స్" అని పిలుస్తారు. వీరు అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు, ఇజ్రాయెల్ లేదా పశ్చిమ దేశాల టెక్నాలజీకి దీటైన ఆయుధాలను కలిగి ఉంటారు. వీరికి ఇచ్చే శిక్షణ అత్యంత కఠినంగా ఉంటుంది. వీరు గెరిల్లా యుద్ధతంత్రం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలు, పట్టణ ప్రాంతాల్లో మెరుపు దాడులు చేయడంలో ఆరితేరిన వారు.

మొజ్తాబా ఖమేనీకి సెక్యూరిటీ పెంపు
ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల్లో తండ్రి అలీ ఖమేనీ మరణించడం, మొజ్తాబా స్వయంగా గాయపడటంతో, ఇరాన్ ప్రభుత్వం సుప్రీం లీడర్‌కు భద్రత పెంచింది. మొజ్తాబా ఇప్పుడు కేవలం నాయకుడు మాత్రమే కాదు, ఇరాన్ విప్లవ వారసత్వానికి చిహ్నం. శత్రువుల నుండి (ముఖ్యంగా మొసాద్ వంటి సంస్థల నుండి) ముప్పు పొంచి ఉంది. దీంతో 'నోపో' దళం ఆయన ఇల్లు, కదలికలను 24 గంటల పాటు పర్యవేక్షిస్తోంది.

కేవలం రక్షణే కాదు.. మానసిక యుద్ధతంత్రం!
వీధుల్లో బ్లాక్ డ్రస్ నోపో ఫోర్స్ కనిపిస్తే, అది ప్రజల్లో, ప్రత్యర్థుల్లో ఓ రకమైన భయాన్ని, గౌరవాన్ని కలిగిస్తుంది. ఇరాన్ ప్రభుత్వం తన బలాన్ని ప్రదర్శించడానికి ఈ దళాన్ని ఒక చిహ్నంగా వాడుకుంటుంది. మొజ్తాబా ఖమేనీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి అంతర్గత సమావేశాల్లో ఈ దళం భారీగా మోహరించడం గమనార్హం.

నోపో దళం కేవలం తుపాకులతోనే కాకుండా, అత్యాధునిక డ్రోన్లు, సైబర్ నిఘా వ్యవస్థలతో కలిసి పనిచేస్తుంది. మొజ్తాబా ఎక్కడ ఉన్నా, ఆ ప్రాంతం చుట్టూ కిలోమీటర్ల మేర నోపో దళం ఒక హై సెక్యూరిటీ కల్పిస్తోంది.

Advertisment
తాజా కథనాలు