Maldives వెళ్లాలనుకునే.. భారత యాత్రికులకు గుడ్ న్యూస్

ఇకపై మాల్దీవుల్లో భారత్ యూపీఐ ప్రారంభించాలని ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జూ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవుల పర్యటన సమయంలో దీనిపై ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

New Update
Mohammed Muizzoo

మాల్దీవులు వెళ్లాలనుకునే భారత్ యాత్రికులకు మాల్దీవుల ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై మాల్దీవుల్లో భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌ని ప్రారంభించాలని ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చూడండి: విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్

ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడుతుందని..

ఈ విషయంపై క్యాబినేట్‌లో కూడా ప్రస్తావించారు. ఈ నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని భావించి తీసుకున్నట్లు తెలిపారు. దేశంలో ఆర్థిక లావాదేవీల్లో ఇంకా డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పెరుగుతుందని మయిజ్జూ తెలిపారు. మాల్దీవుల్లో భారత్ యూపీఐని ప్రారంభించేందుకు ఒక ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు తెలిపారు.

ఇది కూడా చూడండి: మారథాన్‌లో సీఎం.. 2 గంటల్లో 21 కిలోమీటర్లు

మాల్దీవుల్లో ఉన్న బ్యాంకులు, టెలికమ్యూనికేషన్ సంస్థలు, ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న సంస్థలతో పాటు ఫిన్‌టెక్ కంపెనీలు కూడా  ఇందులో చేర్చాలని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవుల పర్యటన చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌కు సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశారు.

ఇది కూడా చూడండి: మాస్ స్టెప్‌లతో డ్యాన్స్ అదరొగొట్టిన మాజీమంత్రి .. నెట్టింట వైరల్!

అక్కడ డిజిటల్ చెల్లింపును ప్రారంభించేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ ట్రేడ్ ఆఫ్ మాల్దీవులు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాలకు ప్రయోజనాలు చేకూరుతాయి. భారతీయులు ఆ దేశంలో యూపీఐ చెల్లింపులు ఎలా చేయవచ్చో.. మాల్దీవులు కూడా మన దేశంలో చేయవచ్చు. అలాగే భారత్‌లోని రూపే కార్డు ఇప్పుడు ఏటీఎం, పీఓసీ మెషీన్లు అంగీకరిస్తాయని ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇది కూడా చూడండి: Frog: ట్రిపుల్‌ఐటీ మెస్‌ బిర్యానీలో కప్ప.. కాదు కాదు కప్ప బిర్యానీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు