Russia-India: ప్రపంచాన్ని శాసించే అరుదైన లోహాలు.. రష్యాతో భారత్ సీక్రెట్ డీల్!

రష్యాలోని కొండల్లో దాగిన భారీ టామ్‌టార్ నిక్షేపంపై భారతదేశం గట్టిగా కన్నేసింది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల కోసం మన దేశం జరుపుతున్న గ్లోబల్ అన్వేషణలో కీలకమైన ముందడుగుగా నిలిచింది.

New Update
FotoJet (11)

రష్యాలోని కొండల్లో దాగిన భారీ టామ్‌టార్ నిక్షేపంపై భారతదేశం గట్టిగా కన్నేసింది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల కోసం మన దేశం జరుపుతున్న గ్లోబల్ అన్వేషణలో కీలకమైన ముందడుగుగా నిలిచింది. మన దేశీయ అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకునే వ్యూహంలో భాగంగా, భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ రష్యాలోని ఈ భారీ నిక్షేపాలపై పటిష్టమైన అధ్యయనం చేస్తోంది. 

ఈ రేర్ ఎర్త్ ఖనిజాలు అనేవి విద్యుత్ వాహనాల మోటార్లు, పవన టర్బైన్లు, అనేక రకాల అధునాతన రక్షణ వ్యవస్థలలో ఉపయోగించే శాశ్వత అయస్కాంతాల తయారీకి అవసరం అవుతాయి. స్వచ్ఛ ఇంధన సాంకేతికతలు, రక్షణ రంగానికి అవసరమైన ముడి పదార్థాల కోసం వీటిని ఉపయోగిస్తారు. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అధిక మొత్తంలో చైనాలో ఉన్నాయి. ఇప్పుడు రష్యాలో ఈ టామ్‌టార్ అనే అరుదైన లోహం లభ్యమైంది. దీని నాణ్యతను తెలుసుకోవడానికి భారత్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ అరుదైన ఖనిజాల పరిశ్రమలో వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్‌లో చైనా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ ఏడాది జనవరి-మే మధ్య కాలంలో ఆ దేశం అరుదైన ఖనిజాల ఎగుమతులు ఏకంగా 25,378 టన్నులకు చేరుకున్నాయి.

ఇది కూడా చూడండి: Crime News : ముస్సోరీ హనీమూన్‌లో విషాదం... ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద మృతి!

అంతర్జాతీయంగా ఉన్న భారీ డిమాండ్ కారణంగా వీటి ఎగుమతి పరిమాణం స్థిరంగా ఉన్నప్పటికీ.. ఎగుమతి విలువలు మాత్రం 44.9% పెరిగి 243.63 మిలియన్లకు చేరాయి. నిజానికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద అరుదైన భూ మూలకాల నిల్వలు భారతదేశంలోనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఖనిజాల పూర్తి శ్రేణిని అధిక స్వచ్ఛత స్థాయిలకు శుద్ధి చేసి, వేరు చేయగల వాణిజ్య స్థాయి ప్లాంట్లు గానీ, దేశీయంగా రేర్ ఎర్త్ అయస్కాంతాలను ఉత్పత్తి చేసే సదుపాయాలు గానీ ప్రస్తుతం భారత్‌లో లేవు. ఈ క్రమంలో దేశీయంగా రేర్ ఎర్త్ అయస్కాంత పరిశ్రమను అభివృద్ధి చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వం 73 బిలియన్ల డాలర్ల ప్రోత్సాహకాన్ని కూడా ఆమోదించింది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING : అక్రమాస్తుల కేసు : డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్!

రష్యాలోని తూర్పు సైబీరియా యాకుటియాలో ఉన్న ఈ టామ్‌టార్ ప్రాజెక్ట్.. ప్రపంచంలోనే ఇంకా అభివృద్ధి చేయని అతిపెద్ద నిక్షేపాలలో ఒకటి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు, రష్యన్ చమురు ఉత్పత్తిదారులైన రోస్‌నెఫ్ట్ వంటి సంస్థలపై ఉన్న నిబంధనలు భవిష్యత్తులో భారత్-రష్యా మధ్య జరిగే ఏ సహకారానికైనా కష్టంగా మారనున్నాయి. అందుకే భారత్ కేవలం రష్యాపైనే కాకుండా.. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, మలావి వంటి దేశాలలో కూడా మైనింగ్ అవకాశాలను అంచనా వేస్తూ, జపాన్, దక్షిణ కొరియా కంపెనీలతో సాంకేతిక చర్చలు జరుపుతోంది. ఈ గ్లోబల్ వ్యూహాల ద్వారా రాబోయే 2029 నుంచి 2030 మధ్య కాలంలో దేశీయంగా రేర్ ఎర్త్ మాగ్నెట్ ఉత్పత్తిని ప్రారంభించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisment
తాజా కథనాలు