N S Raja Subramani : శత్రువుల గుండెల్లో వణుకు..  తదుపరి సీడీఎస్‌గా ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి నియామకం

కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం మే 30తో ముగియనుంది.

New Update
ns raja

కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం మే 30తో ముగియనుండటంతో, ఆయన స్థానంలో రాజా సుబ్రమణి బాధ్యతలు స్వీకరిస్తారు.  ఈ బాధ్యతలతో పాటుగా ఆయన భారత ప్రభుత్వ రక్షణ శాఖ పరిధిలోని మిలిటరీ వ్యవహారాల శాఖకు సెక్రటరీగా కూడా వ్యవహరిస్తారు.  రాజా సుబ్రమణి సుమారు 40 ఏళ్ల పాటు దేశ రక్షణ రంగంలో వివిధ హోదాల్లో సేవలు అందించారు.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన ఈయన, 1985 డిసెంబర్‌లో గర్వాల్ రైఫిల్స్ విభాగంలో సైన్యంలో చేరారు. యూకేలోని జాయింట్ సర్వీసెస్ కమాండ్ స్టాఫ్ కాలేజ్, ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలలో శిక్షణ పొందారు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ నుండి ఎం.ఏ డిగ్రీ, మద్రాస్ యూనివర్సిటీ నుండి డిఫెన్స్ స్టడీస్‌లో ఎం.ఫిల్ పట్టా పొందారు. 

జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ సెక్టార్ డిప్యూటీ కమాండర్‌గా, అస్సాంలో ఆపరేషన్ రైనోలో కౌంటర్ ఇన్సర్జెన్సీ బలగాలకు నేతృత్వం వహించారు. పశ్చిమ సరిహద్దులో అత్యంత కీలకమైన ఆర్మీ 2 కోర్ప్స్ కమాండర్‌గా కూడా పనిచేశారు. కజకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో డిఫెన్స్ అటాచ్‌గా సేవలు అందించారు.

ఆర్మీ వైస్ చీఫ్‌గా

2023లో సెంట్రల్ కమాండ్ చీఫ్‌గా, ఆ తర్వాత 2024 జూలై నుండి 2025 జూలై వరకు ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేశారు. ప్రస్తుతం జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ లో  మిలిటరీ అడ్వైజర్‌గా కొనసాగుతున్నారు. ఈయన విశిష్ట సేవలకు గాను పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్ , సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్ లు లభించాయి.

ఇక మరోవైపు భారత నూతన నావికాదళ అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి మే 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆ మరుసటి రోజే కృష్ణ స్వామినాథన్ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఈయన 2028 డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ముంబై కేంద్రంగా పనిచేసే పశ్చిమ నావికాదళ కమాండ్ కు అధిపతిగా ఉన్న కృష్ణ స్వామినాథన్, రక్షణ రంగంలో అపార అనుభవం ఉన్న అధికారి.1987 జూలై 1న భారత నౌకాదళంలో చేరిన ఈయన కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విభాగాల్లో నిపుణుడు. 

దేశంలోనే అతిపెద్ద యుద్ధనౌక అయిన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మైసూర్, క్షిపణి నౌకలు ఐఎన్ఎస్ విద్యుత్, వినాష్, ఐఎన్ఎస్ కులిష్‌లకు కమాండర్‌గా వ్యవహరించారు. నావికాదళంలో ఎంతో కీలకమైన సేఫ్టీ టీమ్‌ను  ఏర్పాటు చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఈయనకు కూడా పీవీఎస్‌ఎమ్, ఏవీఎస్‌ఎమ్,వీఎస్‌ఎమ్ అవార్డులు దక్కాయి. 

Advertisment
తాజా కథనాలు