/rtv/media/media_files/2026/03/13/economy-of-israel-2026-03-13-13-25-17.jpg)
ఇజ్రాయెల్ భౌగోళికంగా ఒక చిన్న దేశం. మన దేశంలోని ఓ జిల్లా అంత పరిమాణంలో ఉంటుంది. అయినప్పటికీ దశాబ్దాలుగా యుద్ధాలు చేస్తూ, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇజ్రాయెల్ 1948లో దేశంగా ఏర్పడినప్పటి నుండి తన ఉనికి కోసం, భూభాగాల కోసం అనేక దేశాలతో, ముఖ్యంగా అరబ్ దేశాలతో నిరంతరం యుద్ధాలు చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ 22,145 చ.కి.మీలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఇజ్రాయిల్ దేశం కంటే దాదాపు 5 రెట్లు పెద్దది. ఇజ్రాయెల్ జనాభా సుమారు 98 లక్షల నుండి 1 కోటి వరకు ఉంటుంది. అంటే జనాభా పరంగా కూడా తెలంగాణ ఇజ్రాయిల్ కంటే 3.5 రెట్లు పెద్దది.
1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటి తరుచూ ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్, లెబనాన్ దేశాలతో ఇజ్రాయెల్ పోరాటాలు చేస్తోంది. 1982 నుంచి 2006 మధ్య లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న పాలస్తీనా విముక్తి సంస్థ, హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ యుద్ధాలు చేసింది. 2008, 2012, 2014, 2021 ఇజ్రాయెల్ vs హమాస్‌గా యుద్ధం జడిచింది. ప్రస్తుతం ఇరాన్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్‌తో యుద్ధంలో పోరాడుతోంది. ఇజ్రాయెల్ కేవలం తన సైనిక బలంతోనే కాకుండా, పటిష్టమైన ఆర్థిక వ్యూహాలు, అంతర్జాతీయ మిత్రదేశాల మద్దతుతో యుద్ధాలను నడిపిస్తోంది. సంవత్సరాలపాటు దాడులు, శత్రు దేశాలతో యుద్ధాలు చేస్తుందంటే ఇజ్రాయెల్ దగ్గర ఎంత ఆధాయం, ఎన్ని ఆయుధాలు ఉన్నాయో తెలుసా? అసలు అంత డబ్బు ఇజ్రాయెల్ ఎలా సమకూర్చకుంటుందో ఇప్పుడు చూద్దాం..
1. అమెరికా నుంచి భారీ సైనిక సాయం
ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్‌లో అమెరికా సాయం అత్యంత కీలకమైనది. ఏటా అమెరికా సుమారు 3.8 బిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని కంటిన్యూగా అందిస్తుంది. యుద్ధ సమయంలో ఇది మరింత పెరుగుతుంది. ఇటీవల అమెరికా కాంగ్రెస్ అదనంగా బిలియన్ల కొద్దీ డాలర్లను యుద్ధ అవసరాల కోసం (ముఖ్యంగా ఐరన్ డోమ్ క్షిపణుల తయారీకి) మంజూరు చేసింది.
2. శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ (GDP)
ఇజ్రాయెల్ ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందిన దేశం. వారి తలసరి ఆదాయం చాలా ఎక్కువ.
హైటెక్ పరిశ్రమ: ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్, సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ రంగాల్లో ఇజ్రాయెల్ అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీల ద్వారా వచ్చే పన్నులు దేశ ఖజానాకు ప్రధాన ఆదాయం.
డయాస్పోరా బాండ్స్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు ‘ఇజ్రాయెల్ బాండ్ల’ను కొనుగోలు చేయడం ద్వారా దేశానికి బిలియన్ల కొద్దీ డాలర్ల నిధులను సమకూరుస్తారు.
3. ఆయుధ ఎగుమతులు
ఇజ్రాయెల్ కేవలం ఆయుధాలను కొనుగోలు చేయడమే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలకు అత్యాధునిక ఆయుధాలను ఎగుమతి చేస్తుంది. డ్రోన్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, నిఘా సాఫ్ట్‌వేర్ (ఉదాహరణకు పెగాసస్) విక్రయించడం ద్వారా ఇజ్రాయెల్ భారీగా విదేశీ కరెన్సీని సంపాదిస్తుంది.
4. ఎమర్జెన్సీ వార్ ఫండ్
యుద్ధం ప్రకటించినప్పుడు ఇజ్రాయెల్ తన 'సెంట్రల్ బ్యాంక్' వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలను వినియోగిస్తుంది. అలాగే, యుద్ధ అవసరాల కోసం ప్రజలపై ప్రత్యేక పన్నులు లేదా అంతర్గత రుణాల ద్వారా నిధులను సేకరిస్తుంది.
5. గ్యాస్ నిల్వలు
మధ్యధరా సముద్రంలో లభించిన సహజ వాయువు నిల్వలు ఇజ్రాయెల్‌ను ఇంధన దిగుమతిదారు నుండి ఎగుమతిదారుగా మార్చాయి. ఈ గ్యాస్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తోంది.
Follow Us