Burj Khalifa : దుబాయ్ లో హైటెన్షన్.. బూర్జు ఖలీఫా ఖాళీ.. ఏ క్షణమైనా ఇరాన్ అటాక్?

ఇరాన్‌ పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దుబాయ్‌ ని ఇరాన్‌ టార్గెట్‌ చేయడంతో దుబాయ్ ఎయిర్‌‌పోర్టులో విమానాలను నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు.

New Update
FotoJet (16)

Burj Khalifa

 Burj Khalifa : ఇరాన్‌ పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రతీకారంగా ఇరాన్‌ అమెరికా వైమానిక స్థావరాలున్న పలు దేశాలను టార్గెట్‌ చేసింది. అందులో భాగంగా దుబాయ్‌ ని ఇరాన్‌ టార్గెట్‌ చేయడంతో  దుబాయ్ ఎయిర్‌‌పోర్టులో విమానాలను నిలిపివేశారు. దుబాయ్‌పై వరుసగా ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపించడంతో దుబాయ్‌ అప్రమత్తమైంది.

ముందు జాగ్రత్త చర్యగా దుబాయ్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు. ఇరాన్ నుండి క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో దీన్ని ఖాళీ చేయిస్తున్నారు. ఇరాన్ దాడి చేస్తుందన్న భయంతో ముందస్తు చర్యలు చేపట్టారు. శనివారం దుబాయ్, అబుదాబిలో భారీ శబ్దాలు వినిపించాయి. అయితే యూఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంది. అబుదాబిలో కూలిన క్షిపణి శకలాల వల్ల ఒకరు మరణించారు. గల్ఫ్ దేశాల గగనతలం ప్రస్తుతం మూసివేసి హై అలర్ట్ ప్రకటించారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ స్పందించడంతో మరింత ఉద్రిక్తత పెరిగింది. గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. అధికారిక వర్గాల సమాచారం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు