Israel: ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్.. ఐరన్ డోమ్‌ను కూల్చేసిన హెజ్‌బొల్లా

ఇజ్రాయెల్‌కు గగనతల రక్షణ కవచంగా, శత్రువుల పాలిట సింహస్వప్నంగా  గుర్తింపు పొందిన ఐరన్ డోమ్ వ్యవస్థకు లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా బిగ్ షాకిచ్చింది. ఐరన్ డోమ్‌లో అత్యంత కీలకమైన మిసైల్ లాంచింగ్ యూనిట్‌ను కూల్చేసింది.

New Update
Hezbollah airs drone footage showing strike on Iron Dome battery in northern Israel

Hezbollah airs drone footage showing strike on Iron Dome battery in northern Israel

ఇజ్రాయెల్‌కు గగనతల రక్షణ కవచంగా, శత్రువుల పాలిట సింహస్వప్నంగా  గుర్తింపు పొందిన ఐరన్ డోమ్ వ్యవస్థకు లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా బిగ్ షాకిచ్చింది. ఐరన్ డోమ్‌లో అత్యంత కీలకమైన మిసైల్ లాంచింగ్ యూనిట్‌ను తాము FPV (First-Person View) డ్రోన్‌తో విజయవంతంగా కూల్చేశామని హెజ్బొల్లా ప్రకటన చేసింది. అంతేకాదు ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేసింది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ దాడిపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

 అత్యంత కట్టుదిట్టమైన ఐరన్ డోమ్‌ సిస్టమ్ పరిధిని దాటుకుని మరీ శత్రువులు లోపలికి చొచ్చుకురావడంతో రక్షణ రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా శత్రు దేశాల నుంచి వచ్చే రాకెట్లు, క్షిపణులు, సంప్రదాయ డ్రోన్లను ఐరన్ డోమ్ సులభంగానే గుర్తించి గాల్లోనే పేల్చేస్తుంది. కానీ ఈ ఎఫ్‌పీవీ డ్రోన్ల ముందు ఈ వ్యవస్థ తడబడటానికి ఓ బలమైన సాంకేతిక కారణం ఉంది. 

సాధారణ డ్రోన్లు రేడియో సిగ్నల్స్ లేదా GPS ఆధారంగా పనిచేస్తాయి. అందుకే ఇజ్రాయెల్ జామర్లు వీటి సిగ్నల్స్‌ను కట్ చేసి ఈజీగా కూల్చేస్తాయి. కానీ హెజ్‌బొల్లా వాడిన FPV డ్రోన్లు మాత్రం ప్రత్యేకమైన ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా లింక్ అయి ఉంటాయి. ఆపరేటర్లు నేరుగా డ్రోన్‌కు ఉన్న కెమెరా దృశ్యాలను చూస్తూ తీగ ద్వారానే దాన్ని కంట్రోల్ చేస్తారు. దీంతో ఎలాంటి రేడియో జామర్లు వీటిని అడ్డుకోలేవు. ఈ వైర్డ్ టెక్నాలజీ కారణంగానే ఇజ్రాయెల్ ట్రాకింగ్ వ్యవస్థల కళ్లుగప్పి హెజ్‌బొల్లా నేరుగా ఐరన్ డోమ్ లాంచర్‌నే టార్గెట్‌ చేయగలిగింది.

ఎవరూ ఊహించని ఈ వైమానిక ముప్పుతో ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాయి. భవిష్యత్తులో FPV డ్రోన్ల దాడుల నుంచి ఐరన్ డోమ్ రక్షణ యూనిట్లను రక్షించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఇజ్రాయెల్ సైనికాధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎమర్జెన్సీ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ప్రస్తుతం తాత్కాలిక రక్షణ చర్యలను మొదలుపెట్టింది. ఐరన్ డోమ్ లాంచింగ్ బ్యాటరీల చుట్టూ భారీ లోహపు వలలను ఏర్పాటు చేస్తోంది. వీటివల్ల లోపలికి దూసుకొచ్చే డ్రోన్లు అందులోనే చిక్కుకుపోతాయి. ప్రధాన లాంచర్‌కు ఎలాంటి నష్టం వాటిల్లకుండా విఫలమవుతాయని ఇజ్రాయెల్ భావిస్తోంది.

Advertisment
తాజా కథనాలు