Israel: ఇజ్రాయెల్ ఎయిర్‌‌స్ట్రైక్..హమాస్ ఛీఫ్ హతం

అటు హెజ్బుల్లా, ఇటు హమాస్ రెండింటి మీదా వరుస దాడులు జరుపుతోంది ఇజ్రాయెల్. ఈ క్రమంలో  హమాస్‌ పై చేసిన అటాక్‌లో ఆ సంస్థ ప్రభుత్వాధినేత రావి ముష్తాహా ను మట్టుబెట్టింది.ఈయనతో పాటూ మరో ఇద్దరు కమాండర్లు సయేహ్ సిరాహ్, సమేహ్ ఔదేహ్‌లు కూడా మరణించారు.

New Update
attack

Israel Attacks: 

హెజ్బుల్లా కన్నా ముందు ఇజ్రాయెల్ హమాస్ మీద వరుస పెట్టి దాడులు చేసింది. వేమానికి దాడులు, భూతల దాడులతో గాజాను చుట్టుముట్టుంది. హమాస్ బంకర్లను వందల కొద్దీ నాశనం చేసింది.  ఇజ్రాయెల్‌ జరిపిన నిరంతర దాడులతో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌  ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ దాడుల్లోనే హమాస్ ప్రభుత్వాధినేత రావి ముష్తాహా మరణించాడు. ఆయనతోపాటు మరో ఇద్దరు హమాస్‌ కమాండర్లు సయేహ్‌ సిరాజ్‌ సమేహ్ ఔదేహ్‌ మరణించినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది.  

 3 నెలల క్రితం ఉత్తర గాజాలోని ఒక భూగర్భ సొరంగంపై ఐడీఎఫ్‌, ఐఎస్‌ఏ కలిపి జరిపిన దాడిలో ముగ్గురు హమాస్‌ టాప్‌ కమాండర్లు మరణించారు. గాజాలోని హమాస్‌ ప్రభుత్వ అధిపతి రౌహి ముష్తాహా, హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో, హమాస్‌ లేబర్‌ కమిటీ నాయకుడు ససయేహ్‌ సిరాజ్‌, జనరల్‌ సెక్యూరిటీ మెకానిజం కమాండర్‌సమేహ్ ఔదేహ్‌ చనిపోయారని ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ ఈరోజు తన ఎక్స్ లో పోస్ట్ చేసింది. అయితే హమాస్‌ మాత్రం ఇజ్రాయెల్‌ ప్రకటనను ధృవీకరించలేదు.

Also Read: Stock Markets: 11 లక్షల కోట్లు ఉఫ్..భారీ నష్టాల్లో సూచీలు

Advertisment
Advertisment
తాజా కథనాలు