Hamas: వరుసగా మరణిస్తున్న ఛీఫ్‌లు..హమాస్ ఛీఫ్ కూడా ఖతం హమాస్, హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థలను వరుసగా ఇజ్రాయెల్ మట్టు బెట్టుకొస్తోంది. చెప్పినట్టుగానే ఆ రెండు సంస్థనూ నాశనం చేసే దిశగా సాగుతోంది. తాజాగా హమాస్ ఛీఫ్ ఫతే షరీఫ్ కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారని తెలుస్తోంది. By Manogna alamuru 30 Sep 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hamas Chief: లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఆపకుండా వరుస దాడులను చేస్తూ దూసుకుపోతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఒక్కరోజే 105 మందికిపైగా మృతి చెందారు. గత వారం రోజుల్లో చీఫ్ సహా ఏడుగురు కమాండర్లను హెజ్‌బొల్లా కోల్పోయింది. తాజాగా హమాస్ లెబనాన్ విభాగం చీఫ్ ఫతే షరీఫ్‌ను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ విషయాన్ని హమాస్ కూడా ధృవీకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్-బస్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఫతే షరీఫ్, అతని కుటుంబం మరణించినట్లు హమాస్ తెలిపింది. మరోవైపు యెమెన్‌లో హౌతి స్థావరాలపైనా ఇజ్రాయెల్ దళాలు దాడి చేస్తున్నాయి. ఏకకాలంలో హమాస్, హౌతి, హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. దీంతో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది పౌరులు లెబనాన్ వదిలి వెళ్తున్నారు. Also Read: Karnataka: ముడా కుంభోణంలో కర్ణాటక సీఎంపై ఈడీ కేసు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి