అక్టోబర్ 7కు హమాస్ చాలా పెద్ద కుట్రే చేసింది–వాషింగ్టన్ పోస్ట్ గత ఏడాది ఇజ్రాయెల్ మీద హమాస్ చేసిన దాడి చాలా చిన్నది అని..అసలు అమెరికా 9/11తరహా భారీ దాడికి ప్లాన్ చేసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనం కూడా ప్రచురించింది. దాని వివరాలిలా ఉన్నాయి.. By Manogna alamuru 13 Oct 2024 | నవీకరించబడింది పై 13 Oct 2024 18:45 IST in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hamas October 7 Plan: అక్టోబర్ 7 దాడితో అగ్నికి ఆజ్యం పోసింది హమాస్. అప్పుడు మొదలైన యుద్ధం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. హమాస్ రగిల్చిన ఈ చిచ్చు ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ వార్ వరకూ దారి తీసింది. అయితే హమాస్ అక్టోబర్ 7 దాడిని అంతకంటే భీకరంగా ప్లాన్ చేసిందని...అమెరికా 9/11తరహా భారీ దాడికి కుట్ర పన్నిందని చెబుతోంది అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్. అచ్చు అలాగే విమానంతో బిల్డింగ్‌ను కూల్చే ప్లాన్ చేసిందని...ఎక్కువ మంది ప్రాణాలు పోయేలా చేయాలన్నదే హమాస్ లక్ష్యమని చెప్పింది. Exclusive: Video from Hamas militant shows early moments of the October 7 attack on Israel https://t.co/SHV5WKam4V pic.twitter.com/eef2d4MNSJ — CNN International (@cnni) November 15, 2023 ఈ కుట్రకు సంబంధించి రికార్డులను ఖాన్ యూనిస్‌లోని హమాస్ కమాండ్ సెంటర్ నుంచి ఇజ్రాయెల్ దళాలు స్వాధీనం చేసుకుందని వాషింగట్న్ పోస్ట్ తెలిపింది. హమాస్ రాజకీయ, సైనిక విభాగాలు రెండేళ్లుగా వరుసగా జరిపిన సమావేశాల మినిట్స్‌లో ఈ ప్లాన్లు పొందుపర్చి ఉన్నాయి. దీంట్లో ఇరాన్ భాగస్వామ్యం కూడా ఉందని.. ఇరాన్ అధికారులతో హమాస్ నేత యాహ్యా సిన్వార్ సంభాషణలను కూడా గుర్తించారని చెబుతోంది. వీటిని ఐడీఎఫ్ బలగాలు వాషింగ్టన్ పోస్టు, వాల్‌స్ట్రీట్ జర్నల్ వంటి పత్రికలకు అందజేశాయి. న్యూయార్క్ టైమ్స్ పత్రిక సమావేశాలకు సంబంధించిన మినిట్స్‌ను పబ్లిష్ చేసింది. Palestinian resistance forces fire over 5,000 rockets toward Israel, hit regime's airports, military targets pic.twitter.com/KIRx9RSevG — Palestine Highlights (@PalHighlight) October 7, 2023 హమాస్ నేత సిన్వార్, అతని తమ్ముడు హమహ్మద్ డెయిఫ్, మార్వన్ ఇస్సా తదితరులు ఈ కుట్రలో భాగంగా ఉన్నారు. ఇజ్రాయెల్‌పై దాడులకు రైల్వేలు, బోట్లు, గుర్రపు బగ్గీలను వినియోగించాలని వారు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే వారు అలీ ఖమేనీ, ఇతర ఇరాన్ కీలక నాయకులను కలిశారని తెలుస్తోంది. సైనికుల సహాయం కూడా కోరారు. ఈ కుట్రను అమలు పర్చడానికి ఇజ్రాయెల్‌లో కీలక ప్రదేశాలను ఎంపిక చేసుకున్నారు. వాటి సర్వేను కూడా భారీ ఎత్తులో నిర్వహించారు. రెక్కీలో భాగంగా ఇజ్రాయెల్ కీలక ప్రదేశాలకు సంబంధించి 17 వేల ఫోటోలను కలెక్ట్ చేశారు. డ్రోన్లు, శాటిలైట్ల ద్వారా మొత్తం సమాచారం సేకరించారు. టెల్‌అవీవ్‌లోని 68 అంతస్తుల బిల్డింగ్ మోషె అవివ్, ఇజ్రాయిల్ టవర్ లను నేలమట్టం చేయాలని హమాస్ దళాలు కుట్రలు పన్నాయి. The IDF just screened 43 minutes of horrors from the Hamas massacre on October 7 for foreign journalists. I was not there, my colleague @cjkeller8 was. Here is the one minute of footage approved for mass publication at this point, barring most of it out of respect for the dead. pic.twitter.com/UDmQSrkYBL — Amy Spiro (@AmySpiro) October 23, 2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి