సిన్వర్‌ చనిపోయే ముందు డ్రోన్ ఫొటేజ్.. వైరల్ అవుతున్న వీడియో

యాహ్యా సిన్వర్‌ చనిపోయే ముందు అతని కదలికలను సంబంధించిన డ్రోన్ ఫొటేజ్‌ను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. ఓ శిథిలమైన భవనంలో సోఫాలో కూర్చొని ఉన్న సిన్వర్‌ను రికార్డు చేసిన ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

New Update
Yahya Sinwar

హమాస్ గ్రూప్ అధినేత అయిన యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. ఈ విషయాన్ని డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అయితే యాహ్యా సిన్వర్‌ చనిపోయే ముందు అతని కదలికలకు సంబంధించిన డ్రోన్ ఫొటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శిథిలమైన ఓ భవనంలో సోఫాలో కూర్చొని ఉన్న సిన్వర్‌ కదలికకలను ఇజ్రాయెల్ డ్రోన్ రికార్డు చేసింది. ఈ వీడియోను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ అంతర్జాతీయ అధికార ప్రతినిధి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. 

ఇది కూడా చూడండి:  JO Biden: ప్రపంచానికి మంచి రోజు: జో బైడెన్‌!

డేనియల్ హగారీ మాట్లాడుతూ..

ఈ ఘటనపై ఇజ్రాయెల్‌ మిలిటరీ అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ మాట్లాడుతూ.. శిథిలమైన భవనం లోపల హమాస్‌ మిలిటెంట్లు ఎవరైనా ఉన్నారు ఏమోనని తెలుసుకోవడానికి డ్రోన్‌ను పంపించామని తెలిపారు. అయితే అతను సిన్వర్‌ అనుకోలేదు. 

ఇది కూడా చూడండి: Sajjala ramakrishna reddy: తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయానన్న సజ్జల

కేవలం మిలిటెంట్‌ అనే అనుకున్నాం. దీంతో మరోసారి భవనంపై దాడి చేశామని తెలిపారు. భవనం మొత్తం కూలిపోయిన తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని అప్పుడే సిన్వర్‌ అని తెలిసిందన్నారు. ఈ దాడుల్లో మొత్తం ముగ్గురు మిలిటెంట్లు చనిపోయారు. 

ఇది కూడా చూడండి: Infosys: రెండో త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం.. ఎన్ని కోట్లంటే?

ఇజ్రాయెల్‌ సైన్యం దక్షిణ గాజాలో ముగ్గురు హమాస్‌ మిలిటెంట్లను హతమార్చింది. ఇందులో ఓక వ్యక్తికి సిన్వర్‌ పోలికలు ఉన్నాయని డీఎన్‌ఏ పరీక్షలు చేసింది. అతను గ‌తంలో ఇజ్రాయెల్ క‌స్టడీలో ఉన్నారు. ఆ సమయంలో సేకరించిన డీఎన్ఏ ఆధారంగా మరణించింది అతనే అని నిర్ధారించింది. అయితే అతని మరణాన్ని హమాస్ ఇంకా ప్రకటించలేదు.

ఇది కూడా చూడండి:  BIG BREAKING: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు!

Advertisment
Advertisment
తాజా కథనాలు