Hamas: అతి మామూలు షెల్ దాడిలో చనిపోయిన హమాస్ అధినేత

సప్త సముద్రాలు ఈది వీధికాలువలో చనిపోయాడని  సామెత. హమాస్ అధినేత యహ్యా సిన్వర్ మృతి ఇప్పుడు అచ్చం ఇలానే ఉంది. ఇజ్రాయెల్ వెతుకుతూ..పెద్ద పెద్ద దాడులు చేస్తున్నప్పుడు దొరకని సిన్వర్ చివరకు ఓ మామూలు షెల్ దాడిలో చనిపోయాడు. 

New Update
Yahya Sinwar

Hamas Chief Sinwar: 

ఐడీఎఫ్ దళాల చేతిలో హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందాడని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి తెలిపారు. ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కూడా సిన్వార్‌ మృతిని ధ్రువీకరించారు. హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీల కుటుంబాలకు ఈ విషయాన్ని తెలియజేయాలని తన సిబ్బందికి సూచించారు. గత నెల గాజాలోని హమాస్ కమాండ్ సెంటర్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇందులో కమాండర్ సెంటర్ పూర్తిగా దెబ్బతింది. ఈ దాడిలోనే హమాస్ ఛీప్​ యహ్యా సిన్వార్ మృతి చెందారు. తమ దాడుల్లో ముగ్గురు మిలిటెంట్లు చనిపోయారని ఐడీఎఫ్ ప్రకటించింది. అయితే ఇందులో సిన్వార్ ఉన్నారా లేదా అనే విషయాన్ని పరీక్షించాల్సి ఉందని చెప్పారు. ఇప్పుడు డీఎన్ఏ పరీక్షల తర్వాత యహ్యా చనిపోయడని నిర్ధారించారు.

Also Read: ఒక్కడు కాదు చాలామందే..అమ్మవారిపై దాడి కేసులో సంచలన నిజాలు.

మామూలు షెల్ బాంబు దాడిలో మృతి..

అయితే సిన్వర్ కోసం ఇజ్రాయెల్ చాలా వెతికింది. అతను ఎప్పుడూ తన చుట్టూ రక్షణ కవచంగా ఇజ్రాయెల్ బందీలను తను చుట్టూ ఉంచుకుంటాడు. ఈ కారణంగా ఇజ్రాయెల్ దాడులు చేయడానికి కూడా అయ్యేది కాదు. అసలు అతను ఎక్కడ దాక్కున్నాడనేది కూడా ఇజ్రాయెల్‌ కనిపెట్టలేకపోయింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం వరుసగా గాజాలో దాడులు చేస్తూనే ఉంది. యహ్యా బంకర్లు, సొరంగాల్లో తలదాచుకుంటూ తప్పించుకుంటూనే ఉన్నాడు. హమాస్ మిలిటెంట్ల కోసం గాజాలో ఐడీఎఫ్ రోజూ పెట్రోలింగ్ చేస్తుంది. ఈక్రమంలో అక్టోబర్‌ 16న రఫా నగరంలో మిలిటెంట్లు ఉన్నారనే అనుమానంతో ఓ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం ట్యాంకర్ నుంచి షెల్‌ను ప్రయోగించాయి.  దీంతో ఆ భవనం కుప్పకూలింది. అయితే అందులో సిన్వర్‌ ఉన్నట్లు వారికి తెలియదు. కానీ భవనలో ముగ్గురు మిలిటెంట్లు చనిపోయారని మాత్రం తెలుసు. అయితే మరోవైపు గత కొన్ని రోజులుగా సిన్వర్ జాడ ఇజ్రాయెల్‌కు తెలియడం లేదు. దీంతో అనుమాన వచ్చిన ఐడీఎఫ్ భవనం కూలిపోయినప్పుడు దొరికిన ముగ్గురి మిలిటెంట్ల శవాలను పరీక్షించింది. డీఎన్‌ఏ టెస్ట్ నిర్వహించింది. దీంతో చనిపోయినవారిలో యహ్యా సిన్వర్ ఉన్నట్లు తేలంది. అయితే ఆశ్చర్యకరంగా...ఎప్పుడు ఇజ్రాయెల్ బందీలను తన వెంట ఉంచుకునే సిన్వర్...చనిపోయిన రోజు మాత్రం ఒంటరిగానే ఉన్నాడు.

Also Read: మళ్ళీ బాంబు బెదిరింపు..ఈసారి ముంబయ్‌‌–లండన్ ఎయిర్ ఇండియా విమానానికి

సెల్యూట్‌ టూ ఐడీఎఫ్

ఇది ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ డైలాగ్. హమాస్ మీద కీలక విజయం సాధించడంలో సైనికులు పడిన కష్టానికి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గ్యాలంట్ వారికి సెల్యూట్ చేశారు. సిన్వర్‌ మృతితో గాజా వాసులకు స్పష్టమైన సందేశం వెళ్లిందన్నారు. గాజా స్ట్రిప్‌లో ప్రజలు ఇబ్బందులు పడటానికి అతడి హంతక చర్యలే కారణమన్నారు.

Also Read: హీరోయిన్ తమన్నా ఈడీ విచారణ..బెట్టింగ్ యాప్ కేసులో ప్రశ్నలు

Advertisment
Advertisment
తాజా కథనాలు