Green card holders : అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ట్రంప్ బిగ్ షాక్!

ఇప్పటివరకు అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్నవారు కూడా తక్కువ వడ్డీకి ప్రభుత్వ సాయంతో వ్యాపార రుణాలు పొందే అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం.. కంపెనీలో ఒక్క శాతం వాటా గ్రీన్ కార్డ్ హోల్డర్ పేరు మీద ఉన్నా సరే, ఆ కంపెనీకి ప్రభుత్వ రుణాలు ఇవ్వరు.

New Update
us

అమెరికాలో స్థిరపడి, సొంతంగా చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ట్రంప్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. 2026 మార్చి 1 నుంచి గ్రీన్ కార్డ్ ఉన్న వారికి 'అమెరికన్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్' (SBA) ఇచ్చే ప్రభుత్వ పూచీకత్తు రుణాలు అందవు. ఈ మేరకు SBA అధికారికంగా కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది.

ఇప్పటివరకు అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్నవారు కూడా తక్కువ వడ్డీకి ప్రభుత్వ సాయంతో వ్యాపార రుణాలు పొందే అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం.. కంపెనీలో ఒక్క శాతం వాటా గ్రీన్ కార్డ్ హోల్డర్ పేరు మీద ఉన్నా సరే, ఆ కంపెనీకి ప్రభుత్వ రుణాలు ఇవ్వరు. కేవలం పౌరసత్వం ఉన్నవారికే ఈ నిధులు అందాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

మార్చి 1 నుంచి అమల్లోకి

ఈ కొత్త రూల్స్ మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే ఈ లోపే మీ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ అయ్యి, ఒక లోన్ నంబర్ అలాట్ అయితే పాత రూల్స్ వర్తిస్తాయి. లేదంటే కొత్త నిబంధనల ప్రకారం గ్రీన్ కార్డ్ హోల్డర్లకు లోన్ రిజెక్ట్ అవుతుంది.

అమెరికాలో లక్షలాది మంది భారతీయులు గ్రీన్ కార్డులపై ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు నడుపుతున్నారు. ఇప్పుడు వీరందరికీ పెట్టుబడి కోసం ప్రభుత్వ లోన్లు దొరకడం కష్టమవుతుంది. వీరు ఇకపై ప్రైవేట్ బ్యాంకుల నుంచి లేదా భారీ వడ్డీలకు బయట అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది.

అమెరికా పౌరులకే ప్రభుత్వ ప్రయోజనాలు దక్కాలనే ఉద్దేశంతో, దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అక్కడి విపక్ష నేతలు, వలసదారుల సంఘాలు మండిపడుతున్నాయి. కష్టపడి పని చేస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే వలసదారుల పొట్ట కొట్టడం సరికాదని వారు వాదిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు