వైట్ హౌస్‌లో రిపేర్లు.. ట్రంప్‌ వైభోగాన్ని వెక్కిరిస్తున్న 'బంగారు టాయిలెట్'!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లగ్జరీ లైఫ్ స్టైల్, ఆయన అభిరుచులపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వైట్ హౌస్‌లో రినోవేషన్ పనులు జరుగుతుండగా ట్రంప్‌కు ఉన్న గోల్డెన్ పిచ్చి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
_Golden toilet

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లగ్జరీ లైఫ్ స్టైల్, ఆయన అభిరుచులపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వైట్ హౌస్‌లో రినోవేషన్ పనులు జరుగుతుండగా ట్రంప్‌కు ఉన్న గోల్డెన్ పిచ్చి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైట్ హౌస్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా, ప్రఖ్యాత డచ్ చిత్రకారుడు విన్సెంట్ వాన్ గోగ్ గీసిన "Landscape with Snow" అనే పెయింటింగ్‌ను తమకు అప్పుగా ఇవ్వాలని వైట్ హౌస్ వర్గాలు న్యూయార్క్‌లోని 'గుగ్గెన్‌హీమ్ మ్యూజియం'ను కోరాయి. సాధారణంగా అధ్యక్షుల నివాసాల కోసం ఇలాంటి కళాఖండాలను మ్యూజియంల నుండి సేకరించడం ఒక ఆనవాయితీ.

అయితే, మ్యూజియం క్యూరేటర్ నాన్సీ స్పెక్టర్ ఈ అభ్యర్థనను తిరస్కరించడమే కాకుండా, ట్రంప్‌కు ఒక వింతైన ప్రతిపాదన చేశారు. ఆ పెయింటింగ్‌ను ఇవ్వడం సాధ్యం కాదని, దానికి బదులుగా 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన టాయిలెట్‌ను వైట్ హౌస్‌లో ఏర్పాటు చేసుకోవచ్చని ఆమె సమాధానమిచ్చారు.

'అమెరికా' పేరుతో విమర్శనాత్మక కళాఖండం
ఇటాలియన్ కళాకారుడు మారిజియో కాటెలన్ రూపొందించిన ఈ బంగారు టాయిలెట్‌కు "America" అని పేరు పెట్టారు. ఇది కేవలం ప్రదర్శన వస్తువు మాత్రమే కాదు, పూర్తిగా పని చేసే స్థితిలో ఉన్న టాయిలెట్. అమెరికాలోని మితిమీరిన సంపద, వినియోగ సంస్కృతిని ఎద్దేవా చేస్తూ దీనిని రూపొందించారు.

ట్రంప్ తన నివాసాల్లో గోల్డ్ ప్లేటెడ్ వస్తువులను ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి, ఆయన అభిరుచికి ఇది సరిగ్గా సరిపోతుందని మ్యూజియం పరోక్షంగా ఎద్దేవా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీని విలువ సుమారు $1 మిలియన్ (సుమారు రూ.8 కోట్లు) పైగానే ఉంటుందని అంచనా.

వైట్ హౌస్ సమర్థన
ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడిచింది. ఒక పక్క మ్యూజియం ప్రతిపాదన ట్రంప్ అలంకరణ శైలిని ఎగతాళి చేసేలా ఉందని విమర్శలు రాగా, మరోపక్క వైట్ హౌస్ అధికారులు తమ పునరుద్ధరణ పనులను సమర్థించుకున్నారు. చారిత్రాత్మక కట్టడమైన వైట్ హౌస్ గౌరవాన్ని కాపాడేందుకు మరియు పాతబడిపోయిన వ్యవస్థలను బాగు చేసేందుకే ఈ మార్పులు చేస్తున్నామని, ఇందులో విలాసాలకు తావులేదని వారు స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు