పెట్రోల్ బంక్‌లో భారీ పేలుడు.. వీడియో చూస్తే గుండె గుబేల్ రష్యాలోని సౌత్ చెచ్న్యాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పెట్రోల్ పంపులో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. By B Aravind 13 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి రష్యాలోని సౌత్ చెచ్న్యాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పెట్రోల్ పంపులో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశాయి. శనివారం ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణమేంటో ఇంతవరకు తెలియలేదు. ప్రస్తుతం దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు. Also Read: అణుయుద్ధం వైపుగా ఇరాన్, ఇజ్రాయెల్.. రహస్యంగా అణు పరీక్షలు ఇటీవల ఆర్మేనియా దేశంలో కూడా నాగర్నో - కారాబఖ్ ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. 300 మందికిపైగా గాయపడ్డారు. తమ వెహికిల్స్‌లో ఇంధనాన్ని నింపుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు ఆ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నారు. ఆ సమయంలోనే ఇలా ఒక్కసారిగా విస్పోటనం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడున్న భయాందోళనలతో పరుగులు పెట్టారు. View this post on Instagram A post shared by Al Jazeera English (@aljazeeraenglish) #telugu-news #russia #petrol-pump మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి