/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/japan-earth-quake-jpg.webp)
EARTH QUAKE
EARTH QUAKE: దక్షిణ తైవాన్‌లోని యుజింగ్ జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం రాత్రి రిక్టర్ స్కేలుపై పై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 27 మంది గాయపడినట్లు స్థానిక అధికారుల సమాచారం. కొన్ని చోట్ల ఇంటి పై కప్పులు కూలిపోవడం, ప్రజలు ఇళ్లల్లో చిక్కుకుపోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!
🚨🇹🇼 POWERFUL EARTHQUAKE HITS SOUTHERN TAIWAN
— Weather Monitor (@WeatherMonitors) January 20, 2025
A 6.4-magnitude #earthquake struck southern Taiwan at 12:17 am on January 21, 2025. The quake caused widespread damage, including:
- A supermarket in Tainan City's Yujing District, where shelves collapsed and drinks were scattered… https://t.co/SgDnjl2aeA pic.twitter.com/RXSMemsGq1
అర్థరాత్రి భారీ భూకంపం
అయితే సోమవారం రాత్రి ముందుగా 5. 1 తీవ్రతతో యుజింగ్ ప్రాంతానికి 4 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఆ తర్వాత మళ్ళీ అదే ప్రాంతంలో 4.8 తీవ్రతతో భూమి కంపించింది. ఇక అర్థరాత్రి దాటిన తర్వాత 6.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. యుజింగ్ జిల్లాకు ఉత్తరాన 12 కి.మీ దూరంలో అర్ధరాత్రి 12:17 గంటలకు సంభవించిన ఈ భూకంపం దాటికి రాజధాని తైపీలో సైతం భవనాలు కంపించాయి. నాన్క్సీ జిల్లాలో ఓ ఇల్లు కూలిపోగా.. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులతో సహా ఓ చిన్నారిని రెస్క్యూ టీమ్ కాపాడారు.
Also Read: ఐటీ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. దిల్ రాజు సతీమణితో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించిన అధికారులు!