Dubai attacked Iran : ఇరాన్ పై దుబాయ్‌ భీకర దాడి...సీజ్ ఫైర్ నుంచి ఇరాన్ వెనక్కు ?

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్‌తో యుద్ధానికి ఇజ్రాయెల్‌, అమెరికా విరామం ప్రకటించగా తాజాగా దుబాయ్‌ యుద్ధంలోకి దిగడం సంచలనంగా మారింది.ఇరాన్‌ ఆయిల్ రిఫైనరీలపై దుబాయ్‌ భీకర దాడులు చేసినట్లు తెలుస్తోంది.

New Update
FotoJet (6)

Dubai's fierce attack on Iran ?

Dubai attacked Iran : ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్‌తో యుద్ధానికి ఇజ్రాయెల్‌, అమెరికా విరామం ప్రకటించగా తాజాగా దుబాయ్‌ యుద్ధంలోకి దిగడం సంచలనంగా మారింది.ఇరాన్‌ ఆయిల్ రిఫైనరీలపై దుబాయ్‌ భీకర దాడులు చేసినట్లు తెలుస్తోంది. దాడులు చేసింది దుబాయ్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. పర్షియన్ గల్ఫ్‌లోని సిరి, లావాన్‌ దీవుల్లోని.. ఆయిల్ రిఫైనరీలపై బాంబుల వర్షం కురపించడంతో పాటు పలు పెట్రోకెమికల్ స్థావరాలపైనా దాడులు చేసింది.

డ్రోన్లు, మిరాజ్‌ 2000-9 EAD ఫైటర్‌ జెట్లతో.. దుబాయ్ దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణ ఇరాన్‌ మీదుగా UAE ఫైటర్ జెట్లు ఎగురుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఈ దాడి జరిగిన వెంటనే UAEపై ఇరాన్‌ మిసైళ్ల వర్షం కురిపించింది. ఇరాన్ మిసైళ్లను పేల్చేసినట్లు దుబాయ్‌ ప్రకటించింది.అమెరికా, ఇజ్రాయెల్‌ సీజ్‌ఫైర్‌ ప్రకటించడంతో..గల్ఫ్‌ దేశాలు ఇరాన్‌పైకి యుద్ధంలోకి దిగాయా అనే సందేహం వ్యక్తమవుతోంది.

సీజ్‌ ఫైర్‌ నుంచి ఇరాన్‌ వెనక్కు

 అమెరికాకు ఇరాన్ బిగ్ షాకిచ్చింది. సీజ్‌ఫైర్‌ ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించింది.  ఈ మేరకు-- ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.  లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. లెబనాన్‌పై 10 నిమిషాల్లోనే 100 మిస్సైళ్లతో ఇజ్రాయెల్ దాడి చేయడం సంచలనంగా మారింది. సీజ్‌ఫైర్ రద్దుపై రష్యా, చైనాతో విదేశాంగ మంత్రి ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. యుద్ధంలో సాయం చేయాలని ఆ దేశాలను కోరినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్‌కు సాయం చేస్తే 50% టారిఫ్స్ విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.మరోసారి హార్మోజ్ జలసంధిని పూర్తిగా మూసివేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇరాన్ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.-- ఇప్పటికే ఇరాన్‌లోని ఇండియన్స్ బయటకు వచ్చేయండని కేంద్రం పిలుపు నిచ్చింది.మూడవ ప్రపంచ యుద్ధం దిశగా పరిస్థితులు మారుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. యుద్ధం ఆపే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రకటించడం గమనార్హం

Advertisment
తాజా కథనాలు