/rtv/media/media_files/2026/05/01/donald-trump-photo-2026-05-01-11-21-57.jpg)
అమెరికా రిపబ్లికన్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికా పాస్‌పోర్ట్‌లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటో దర్శనమివ్వనుంది. అయితే ఇవి లిమిటెడ్ ఎడిషన్ పాస్‌పోర్ట్‌లు అని, అంటే కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే వీటిని జారీ చేస్తారని వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికా స్వాతంత్ర్యం పొంది 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ట్రంప్ తన ఎన్నికల నినాదమైన MAGA (Make America Great Again) పేరునే ఈ పాస్‌పోర్ట్‌లకు పెట్టారు.
మొదటి పేజీలోనే ట్రంప్ ఫోటో
వైట్ హౌస్ విడుదల చేసిన వీడియో ప్రకారం.. పాస్‌పోర్ట్ మొదటి పేజీలోనే ట్రంప్ ఫోటో ఉంటుంది. ఆ తర్వాత రెండో పేజీలో అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకు సంబంధించిన ప్రఖ్యాత ఫౌండింగ్ ఫాదర్స్ పెయింటింగ్‌ను ముద్రించారు. దేశ స్వాతంత్ర్య చిహ్నాల కంటే ముందే తన ఫోటో ఉండేలా చూసుకోవడం ట్రంప్ మొండితనానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. అమెరికా చరిత్రలో ఒక అధ్యక్షుడి ఫోటో పాస్‌పోర్ట్‌పై ఉండటం ఇదే మొదటిసారి.
కేవలం పాస్‌పోర్ట్ మాత్రమే కాదు, తన రెండో విడత పాలనలో ట్రంప్ అమెరికా అధికారిక చిహ్నాలన్నింటినీ తన మయం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై ట్రంప్ ఫోటోలతో కూడిన భారీ బ్యానర్లు వెలిశాయి. అమెరికా నేవీలో ట్రంప్ క్లాస్ యుద్ధ నౌకలను తయారు చేస్తామని ప్రకటించారు. ప్రముఖ జాన్ ఎఫ్. కెన్నెడీ సెంటర్ పేరును ట్రంప్-కెన్నెడీ సెంటర్ గా మార్చారు. చివరకు అమెరికా డాలర్ నోట్లపై కూడా ట్రంప్ సంతకం ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి.
డొనాల్డ్ ట్రంప్‌కు తన పేరును, ఫోటోను ప్రదర్శించుకోవడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికే బ్రాండ్ ట్రంప్ పేరుతో షూలు, టోపీలు, వాచీలు, గిటార్లు, పర్ఫ్యూమ్‌లు, చివరికి బైబిళ్లు కూడా మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. వీటి ద్వారా ట్రంప్ కార్పొరేషన్ ఏటా సుమారు 750 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. ఇంత సంపాదన ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఆస్తులపై కూడా తన ముద్ర ఉండాలని ఆయన కోరుకుంటున్నారు.
సైకాలజీ ప్రకారం ట్రంప్ ప్రవర్తనను నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ (NPD) అని పిలుస్తారు. ఈ సమస్య ఉన్నవారు తామే అందరికంటే గొప్పవారమని, తమను అందరూ పొగడాలని కోరుకుంటారు. తాము చాలా విజయవంతమైన వ్యక్తులమని లోకానికి చాటిచెప్పేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. అందుకే ప్రతి వస్తువుపై తన ఫోటో ఉండాలని ట్రంప్ ఆరాటపడుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉద్యోగులు రాజీనామా
తన ఫోటోలు, సంతకాలపై చూపిస్తున్న శ్రద్ధను ట్రంప్ పాలనపై చూపించడం లేదనే విమర్శలు గణాంకాల రూపంలో కనిపిస్తున్నాయి. అమెరికాలో పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదల 3.3 శాతానికి చేరింది. ఇది గత రెండున్నర ఏళ్లలో అత్యధికం. మెడికల్ ఇన్సూరెన్స్‌లో ప్రభుత్వ వాటాను తగ్గించడంతో 12 లక్షల మంది అమెరికన్లు వైద్య సదుపాయాలకు దూరమయ్యారు. విద్యాశాఖలో రీసెర్చ్ నిధులను తగ్గించడం వల్ల దాదాపు 2 వేల మంది సీనియర్ ఉద్యోగులు రాజీనామా చేశారు.
ప్రస్తుతం అమెరికాలో 64 శాతం మంది ప్రజలు ట్రంప్ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారు. అయినప్పటికీ, పాలనను మెరుగుపరచడం కంటే డాలర్లు, పాస్‌పోర్ట్‌లపై తన ప్రచారాన్ని పెంచుకోవడానికే ట్రంప్ ప్రాధాన్యత ఇస్తున్నారు.
Follow Us