Elon Musk : ఎలాన్ మస్క్ సంపదను ప్రపంచమంతటా పంచితే ఎవరికి ఎంత వస్తుందో తెలుసా?

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..ఎలాన్ మస్క్ మొత్తం ఆస్తి 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనితో ఆయన ప్రపంచంలోనే మొదటి 'ట్రిలియనీర్'గా నిలిచారు. అయితే మస్క్ ఆస్తిని గనుక ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ సమానంగా పంచితే, ఒక్కొక్కరికి దాదాపు రూ. 10,300 లభిస్తాయి.

New Update
Elon Musk

Elon Musk

Elon Musk : ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. వయసు పెరిగేకొద్దీ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని, సమాజంలో పేరుప్రఖ్యాతులు తెచ్చుకునేలా విపరీతంగా సంపాదించాలని చాలామంది కలలుకంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఆస్తిని గనుక ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ సమానంగా పంచితే, ఒక్కొక్కరికి దాదాపు రూ. 10,300 లభిస్తాయని మీకు తెలుసా?

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ మొత్తం ఆస్తి 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనితో ఆయన ప్రపంచంలోనే మొదటి 'ట్రిలియనీర్' (Trillionaire) గా నిలిచారు. ఒక ట్రిలియన్ డాలర్ల విలువ 1 బిలియన్ (వంద కోట్లు) డాలర్ల కంటే వెయ్యి రెట్లు పెద్దది. అదే పది లక్షల డాలర్లతో పోల్చి చూస్తే.. ఇది పది లక్షల రెట్లు ఎక్కువ. ఇంతటి భారీ సంపదకు మస్క్ ఒక్కడే అధిపతి.యు.ఎస్. సెన్సస్ బ్యూరో (U.S. Census Bureau) లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 820 కోట్ల (8.2 బిలియన్) జనాభా ఉంది. ఒకవేళ మస్క్ ఆస్తినంతా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ సమానంగా పంచిపెడితే, తలా దాదాపు 122 అమెరికన్ డాలర్లు లభిస్తాయి. అంటే భారతీయ కరెన్సీలో ఇది దాదాపు రూ. 10,300 కు సమానం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా కేవలం 21 దేశాల ఆర్థిక వ్యవస్థలు (GDP) మాత్రమే ఈ ట్రిలియన్ డాలర్ల మార్కును దాటగలిగాయి.

లక్షల కొద్దీ ఇళ్లను కొనవచ్చు!

ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెయింట్ లూయిస్ గణాంకాల ప్రకారం.. అమెరికాలో విక్రయించే ఒక సగటు ఇల్లు లేదా విల్లా ధర సుమారు 403,200 డాలర్లు ఉంటుంది. ఈ లెక్కన ఎలోన్ మస్క్ తనకున్న సంపదతో అమెరికాలోనే ఏకంగా 25 లక్షల విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేయవచ్చు. రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే, ఈ డబ్బుతో ఒక చిన్న దేశానికి కావలసిన గృహ అవసరాలన్నింటినీ సులభంగా తీర్చవచ్చు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. గూగుల్ కో-ఫౌండర్ లారీ పేజ్ 295 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే రెండవ అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.  

Advertisment
తాజా కథనాలు